Reliance SBI card: కాంబో అదిరింది.. రిలయన్స్, ఎస్బీఐ కలిసి కొత్త క్రెడిట్ కార్డ్.. బెనిఫిట్స్ పీక్స్..
దేశంలో అతి పెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పదులో సంఖ్యలో క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తోంది. అంతేకాక వివిధ కంపెనీలతో భాగస్వామిగా ఉండి కార్డులను విడుదల చేస్తుంటుంది. ఈసారి మన దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ తో కలిసి ఎస్బీఐ ఓ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. దాని పేరు రిలయన్స్ ఎస్బీఐ కార్డ్.

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ కార్డులపై వస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డులు ఆకర్షిస్తుండగా.. అత్యవసర సమయాల్లో డబ్బులు వెతుక్కొనే పని లేకుండా ఈ క్రెడిట్ కార్డులు ఉపయోగపడుతుండటం వీటి వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా ఉంది. దేశంలో అతి పెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పదులో సంఖ్యలో క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తోంది. అంతేకాక వివిధ కంపెనీలతో భాగస్వామిగా ఉండి కార్డులను విడుదల చేస్తుంటుంది. ఈసారి మన దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ తో కలిసి ఎస్బీఐ కార్డ్ ఓ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. దాని పేరు రిలయన్స్ ఎస్బీఐ కార్డ్. ఇది జీవన శైలి కోసం చేసే వివిధ ఖర్చులకు బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రయోజనాలు..
ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ నుంచి కిరాణా, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫర్నీచర్, ఆభరణాలు వంటి మరెన్నో ఉత్పత్తులు రిలయన్స్ రిటైల్ గా విక్రయిస్తుంటుంది. ఈ విస్తృతమైన, వైవిధ్యమైన వ్యాపార వ్యవస్థలో లావాదేవీలు చేసేటప్పుడు కార్డ్ హోల్డర్‌లు రివార్డ్‌లతో పాటు ఇతర ప్రయోజనాలను అన్‌లాక్ చేయడానికి ఈ కొత్త కార్డ్ వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాక కాలానుగుణంగా అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. దేశంలోని రెండు ప్రధాన వ్యాపార దిగ్గజాల మేలు కలయికతో వినియోగదారులకు బహుళ ప్రయోజనాలు పొందుకొనే అవకాశం ఏర్పడింది. స్పెషల్ ఓపెనింగ్ ఆఫర్లు, రివార్డులు, వోచర్లు వంటి అనేక ఆఫర్లు ఈ కార్డుపై లభిస్తున్నాయి.
రిలయన్స్ ఎస్బీఐ కార్డ్..
రిలయన్స్, ఎస్బీఐ భాగస్వామ్యం కస్టమర్ అనుభవాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోందని ఆ కంపెనీలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. భారతీయ మార్కెట్‌లో క్రెడిట్ కార్డ్ రివార్డ్‌ల కోసం కొత్త బెంచ్‌మార్క్‌ని సృష్టించాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నాయి. కాగా ఈ కో-బ్రాండెడ్ కార్డ్ రెండు వేరియంట్‌లలో ప్రారంభమైంది. అవి రిలయన్స్ ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్. ప్రతి దానిలో విభిన్నమైన రివార్డ్‌లు, విభిన్నమైన వినియోగదారుల అవసరాల కోసం జీవనశైలి ప్రోత్సాహకాలు ఉంటాయి. ఈ కార్డ్ రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. రూపే ప్లాట్‌ఫారమ్‌లో పరిచయం చేశారు. రిలయన్స్ స్మార్ట్, స్మార్ట్ బజార్, రిలయన్స్ ఫ్రెష్ సిగ్నేచర్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, జియోమార్ట్, అజియో, రిలయన్స్ జ్యువెల్స్, అర్బన్ లాడర్, నెట్‌మెడ్స్ వంటి వాటిల్లో అధిక ఆఫర్లను పొందొచ్చు.
వినియోగదారులకు ప్రయోజనకరంగా..
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ డైరెక్టర్ వి సుబ్రమణ్యం మాట్లాడుతూ, రిలయన్స్ రిటైల్‌లో, తమ కస్టమర్‌ల షాపింగ్ అనుభవాన్ని ప్రతిరోజూ మరింత ఆనందదాయకంగా మార్చడం కోసం ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. ఎస్బీఐ కార్డ్‌తో తమ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఈ నిబద్ధతకు మరో అడుగుగా ఆయన అభివర్ణించారు. క్రెడిట్ కార్డ్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఎస్బీఐ కార్డ్‌తో భాగస్వామ్యం కావడానికి సంతోషిస్తున్నామని ప్రకటించారు. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్‌ని ఆన్ లైన్, లేదా రిలయన్స్ అన్ని స్టోర్లలోనూ వినియోగించుకోవచ్చని చెప్పారు. తద్వారా విస్తృత శ్రేణి ప్రయోజనాలు, ప్రత్యేకమైన డిస్కౌంట్‌లు, రివార్డ్‌లు పొందవచ్చని వివరించారు. అలాగే ఎస్బీఐ కార్డ్ ఎండీ అండ్ సీఈఓ అభిజిత్ చక్రవర్తి మాట్లాడుతూ భారతదేశం వ్యవస్థీకృత రిటైల్‌ను పునర్నిర్వచించిన రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఎస్బీఐ కార్డ్ ద్వారా కస్టమర్‌లకు వారి జీవనశైలి అవసరాలను తీర్చేటప్పుడు బలమైన విలువను అందించే ఉత్పత్తులను డెలివరీ చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ఫీజు..
రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ యాన్యువల్ ఫీజు రూ. 2,999లతో పాటు అదనపు పన్నులు రూ. 499 వరకూ ఉంటుందన్నారు. అయితే రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ లో ఏడాదికి రూ. 3,00,000, అదే రిలయన్స్ ఎస్బీఐ కార్డ్‌పై అయితే రూ. 1,00,000 వరకూ ఖర్చు చేయగలిగితే కార్డు హోల్డర్లు ఈ యాన్యువల్ ఫీజు మినహాయింపును పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..