Redmi Smart TV: రెడ్‌ మీ నుంచి రెండు స్మార్ట్ టీవీలు విడుదల.. అద్భుతమైన ఫీచర్లు.. ధర కూడా తక్కువే..?

|

Sep 22, 2021 | 12:37 PM

Redmi Smart TV: రెడ్‌మీ కొత్తగా ఇండియాలో రెండు స్మార్ట్ టీవీ మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఈ టీవీలు 32, 43 ఇంచ్ సైజ్‌లో ఉన్నాయి.

Redmi Smart TV: రెడ్‌ మీ నుంచి రెండు స్మార్ట్ టీవీలు విడుదల.. అద్భుతమైన ఫీచర్లు.. ధర కూడా తక్కువే..?
Redmi
Follow us on

Redmi Smart TV: రెడ్‌మీ కొత్తగా ఇండియాలో రెండు స్మార్ట్ టీవీ మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఈ టీవీలు 32, 43 ఇంచ్ సైజ్‌లో ఉన్నాయి. సరికొత్త ఫీచ‌ర్లతో అద్భుతంగా ఉన్నాయి. డాల్బీ ఆడియో, డీటీఎస్ వ‌ర్చువ‌ల్ ఎక్స్ ఫార్మాట్‌తో 20 వాట్స్ ఆడియో ఔట్‌పుట్‌, వివిడ్ పిక్చర్ ఇంజన్‌(వీపీఈ), జియోమీ ఇన్ హౌస్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ప్యాచ్‌వాల్ 4, బ్లూటూత్ వీ5.0, డ్యుయ‌ల్ బాండ్ వైఫై, ఆటో లేటెన్సీ మోడ్ లాంటి బెస్ట్ ఫీచ‌ర్లు ఈ టీవీలలో ఉన్నాయి.

రెడ్‌మీ గతంలో స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ పేరుతో స్మార్ట్ టీవీల‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తన మొదటి స్మార్ట్ టీవీని ఈ ఏడాది ప్రారంభంలో రూ.32,999 ప్రారంభ ధరలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు రిలీజ్‌ చేసిన టీవీలు అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అయితే.. ఇటీవ‌లే ఎంఐ బ్రాండ్ పేరును త‌మ ప్రొడ‌క్ట్స్ మీద తొల‌గించి.. జియోమీ పేరును మాత్రమే పెట్టనున్నట్టు కంపెనీ ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. రెడ్‌మీ ద్వారా వ‌చ్చే ప్రొడ‌క్ట్స్ పేరులో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు. కేవ‌లం ఎంఐ బ్రాండ్ పేరును తొల‌గించి.. జియోమీ పేరునే లోగోగా ఉప‌యోగించ‌నున్నారు.

రియల్‌ మీ స్మార్ట్ టీవీ..
రియల్ మీ కంపెనీ కూడా కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ లాంచ్‌ చేయనుంది. మరిన్ని ఫీచర్లను జోడించి రియల్ మీనియో 32 ఇంచ్ టీవీని లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో బెజెల్ లెస్ ఎల్ఈడీ డిస్ ప్లే, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో 20 వాట్స్ స్పీకర్ ఫీచర్లు ఉన్నాయి. రియల్ మీ ఇప్పటికే.. ఫుల్ హెచ్ డీ స్మార్ట్ టీవీసిరీస్లను భారత్‌లో విక్రయిస్తోంది. వాటి ధర రూ.20 వేల లోపే ఉంది.

CAT Registration 2021: విద్యార్థులకు గమనిక..! క్యాట్ పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరితేది..

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ అధికార నివాసంపై దాడి కేసులో పురోగతి.. ఐదుగురు నిందితుల అరెస్ట్!

PM Modi’s US Visit: అమెరికా పర్యటకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ.. జో బైడెన్ తో భేటీపై సర్వత్రా ఆసక్తి