Redmi 11 Prime 4G: రూ.14 వేలకే 50ఎంపీ కెమెరా.. గతేడాది విడుదలైన 4జీ ఫోన్‌పై భారీగా ధర తగ్గించిన రెడ్మీ.. వివరాలివే..

|

Jan 12, 2023 | 12:25 PM

గతేడాది భారత మార్కెట్‌లోకి వచ్చిన Redmi 11 Prime ధరను తగ్గింది . ఈ రెడ్మీ 11 ప్రైమ్ 4జీకి చెందిన రెండు వేరియంట్లపై రూ.1000 ధర తగ్గించింది Xiaomi. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ధరల..

Redmi 11 Prime 4G: రూ.14 వేలకే 50ఎంపీ కెమెరా.. గతేడాది విడుదలైన 4జీ ఫోన్‌పై భారీగా ధర తగ్గించిన రెడ్మీ.. వివరాలివే..
Redmi 11 Prime 4g
Follow us on

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi ఇటీవలే తన వినియోగదారుల కోసం Redmi Note 12 సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ఈ కంపెనీ నుంచి కొత్త సిరీస్ వచ్చిన కొద్ది రోజులలోనే గత ఏడాది రిలీజైన ఫోన్ ధరను ఆమాంతం తగ్గించేసింది Xiaomi. గతేడాది భారత మార్కెట్‌లోకి వచ్చిన Redmi 11 Prime ధరను తగ్గింది . ఈ రెడ్మీ 11 ప్రైమ్ 4జీకి చెందిన రెండు వేరియంట్లపై రూ.1000 ధర తగ్గించింది Xiaomi. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ధరల వివరాలు, ఇప్పుడు ఉన్న ధరలు, ఫోన్ ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో Redmi 11 Prime 4G ధర: 

Redmi 11 Prime 4జీ మోడల్‌లో 4 జీబీ ర్యామ్‌+64 జీబీ ఇంటర్నల్ మెమోరీ వేరియంట్, 6 జీబీ ర్యామ్‌+128 జీబీ ఇంటర్నల్ మెమోరీ వేరియంట్‌గా రెండు రకాలు ఉన్నాయి. 4 GB RAM వేరియంట్ ధరలో 1000 రూపాయల తగ్గింపు తర్వాత, ఇప్పుడు దానిని 12,999 రూపాయలకు బదులుగా 11,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే 6 GB RAM మోడల్‌ను ఇప్పుడు 14,999 రూపాయలకు బదులుగా 13,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అంటే రెండు మోడళ్లను రూ.1000 తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు. ఈ బడ్జెట్ ఫోన్ కొత్త ధరతో Xiaomi అధికారిక సైట్ Mi.com అలాగే Amazonలో మీరు కొనుగోలు చేయవచ్చు.

Redmi 11 Prime 4G ఫీచర్లు స్పెసిఫికేషన్‌లు:

  • డిస్ప్లే: Redmi 11 Prime మొబైల్ 6.5-అంగుళాల పూర్తి-HD ప్లస్ (1080×2400 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను 90 Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. అంతేకాక ఇది 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 400 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోన్ భద్రత కోసం దాని కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్యానెల్‌ని ఉపయోగించింది.
  • ప్రాసెసర్: Mali G57 MC2 GPU వేగం, మల్టీ టాస్కింగ్ కోసం Redmi 11 Prime 4Gలో MediaTek Helio G99 చిప్‌సెట్‌ను గ్రాఫిక్స్ కోసం ఉపయోగించారు
  • కెమెరా: ఫోన్ వెనుక ప్యానెల్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు వైపు 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంటుంది.
  • కనెక్టివిటీ: USB టైప్-సి పోర్ట్ మాత్రమే కాక కాకుండా, బ్లూటూత్ వెర్షన్ 5.1, A-GPS, GPS, IR బ్లాస్టర్, GLONASS, Wi-Fi 802.11 a/b/g/n/ac వంటి ఫీచర్లు ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి.
  • బ్యాటరీ: 5000 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జ్‌కు చేసే ఈ ఫోన్.. 5W రివర్స్ ఛార్జ్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి