Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBL Bank FD: కొత్త స్కీమ్‌.. కొంగొత్త ప్రయోజనాలు.. రాబడికి తిరుగుండదు.. పూర్తి వివరాలు

ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఆర్‌బీఎల్‌ ఓ ప్రత్యేకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్‌బీఎల్‌ ఏస్ (ACE) ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ పేరిట దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా తమ కస్టమర్లకు గరిష్టంగా 8.5 శాతం మేర వడ్డీ అందిస్తోంది.

RBL Bank FD: కొత్త స్కీమ్‌.. కొంగొత్త ప్రయోజనాలు.. రాబడికి తిరుగుండదు.. పూర్తి వివరాలు
Bank Fixed Deposit
Follow us
Madhu

|

Updated on: Jun 05, 2023 | 12:30 PM

ప్రజలకు అందుబాటులో ఉన్న సురక్షిత పెట్టుబడి పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ ఒకటి. భవిష్యత్తు అవసరాల కోసం నగదు దాచాలనుకొనే చాలా మంది వినియోగదారులకు ఇదే ఫస్ట్‌ ఆప్షన్‌. అధిక వడ్డీతో పాటు పలు ప్రయోజనాలు వీటి వైపు మళ్లేలా చేస్తాయి. వినియోగదారులు బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసుల్లో వినియోగదారులు ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించి, పెట్టుబడి ప్రారంభించవచ్చు. అయితే వడ్డీ రేట్లు మాత్రం ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటాయి. పోస్ట్‌ ఆఫీసులో ఒక వడ్డీ రేటు.. బ్యాంకుల్లో రకాలను బట్టి రేటు మారుతుంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల్లోనూ రకరకాల వడ్డీ రేట్లు ఉంటాయి. మీరూ ఒక వేళ అధిక వడ్డీ వచ్చే బ్యాంకు కోసం ఎదురుచూస్తుంటే ఈ కథనం అస్సలు మిస్‌ అవ్వొద్దు..

ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఆర్‌బీఎల్‌ ఓ ప్రత్యేకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్‌బీఎల్‌ ఏస్ (ACE) ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ పేరిట దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా తమ కస్టమర్లకు గరిష్టంగా 8.5 శాతం మేర వడ్డీ అందిస్తోంది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ వంటి దిగ్గజ బ్యాంకుల కన్నా ఎక్కువే అని చెప్పాలి. ఈ కొత్త స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 12 నెలల నుంచి 20 ఏళ్ల వరకు ఉంది. బ్యాంకు సేవలు, రివార్డ్స్ రూపంలో ఎక్కువ ఆప్షన్స్ ఈ కొత్త పథకం ద్వారా అందిస్తోంది. అయితే కనీస డిపాజిట్ మొత్తం రూ. 50 లక్షలుగా ఉండాలి. అలాగే గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు.

ఆర్‌బీఎల్‌ ఏస్‌ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇలా..

7 రోజుల నుంచి ఏడాది వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై అయితే 3.5 శాతం నుంచి 6.05 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. అలాగే ఏడాది నుంచి 15 నెలల వరకు టెన్యూర్ అయితే వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఇంకా 15 నెలల నుంచి 24 నెలల వరకు టెన్యూర్ అయితే వడ్డీ రేటు 7.8 శాతంగా ఉంది. 24 నెలల నుంచి 36 నెలల వరకు టెన్యూర్ అయితే 7.5 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. 36 నెలల నుంచి 60 నెలల టెన్యూర్ అయితే 7.1 శాతం వడ్డీ ఉంది. 60 నెలల నుంచి 240 నెలల టెన్యూర్ అయితే వడ్డీ రేటు 7 శాతంగా వస్తుంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీపై అయితే 7.1 శాతం వడ్డీ పొందొచ్చు. దీని టెన్యూర్ 60 నెలలు. సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8.75 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎవరికి అధిక ప్రయోజనం..

ఆర్‌బీఎల్ బ్యాంక్ కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌లో దేశ పౌరులతో పాటు ఎన్ఆర్ఐలకు సైతం అందుబాటులో ఉంది. బ్యాంక్ తమ కస్టమర్లకు అధిక ప్రయోజనం కల్పించాలని కోరుకుంటోంది. ఎక్కువ మందికి ఈ ప్రయోజం అందించాలనే ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ వడ్డీ ఇస్తున్నాం. తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.’ అని బ్రాంచ్, బిజినెస్ బ్యాంకింగ్ హెడ్ ఆర్‌బీఎల్ బ్యాంక్ దీపక్ గద్దయాన్ తెలిపారు.

ఆర్‌బీఎల్ బ్యాంకుకు దేశ వ్యాప్తంగా 517 బ్రాంచులు, 1,166 బిజినెస్ కరస్పాండెట్ బ్రాంచులు, 414 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తంగా 12.91 మిలియన్ కస్టరమర్లకు సేవలందిస్తోంది. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్‌బీఎల్ బ్యాంక్ సేవలందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..