Reliance Capital: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎదురుదెబ్బ.. RBI సంచలన నిర్ణయం

| Edited By: Ravi Kiran

Nov 29, 2021 | 7:16 PM

Reliance Capital: దేశంలో అత్యధిక ధనవంతుడుగా ఉన్న ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌..

Reliance Capital: అనిల్‌ అంబానీ రిలయన్స్‌ క్యాపిటల్‌కు ఎదురుదెబ్బ.. RBI సంచలన నిర్ణయం
Follow us on

Reliance Capital: దేశంలో అత్యధిక ధనవంతుడుగా ఉన్న ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ మరింతగా దివాలా తీసింది. కంపెనీ బోర్డును రద్దు చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) వెల్లడించింది. చేసిన అప్పులను తీర్చడంలో కంపెనీ విఫలం కావడంతో ఆర్బీఐఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమిక విచారణలో కంపెనీ నిర్వహణకు సంబంధించిన అనేక తప్పిదాలు ఉన్నట్లు ఆర్బీఐ గుర్తించింది. రిలయన్స్ క్యాపిటల్ బోర్డు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందున బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై. నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 45-IE (1) ప్రకారం అందించబడిన అధికారాలను ఉపయోగించడం ద్వారా, బోర్డ్ ఆఫ్ రిలయన్స్ క్యాపిటల్ అధికారాలను స్వాధీనం చేసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. దివాలా చట్టం కింద కంపెనీపై ఆర్‌బిఐ త్వరలో చర్యలు ప్రారంభించనుంది.

అయితే రిలయన్స్‌ క్యాపిటల్‌ గత ఏడాది హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ), యాక్సిస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.624 కోట్ల విలువైన రుణాలపై వడ్డీ చెల్లింపులను చెల్లించకపోవడాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. అక్టోబర్‌ 31 నాటికి వడ్డీ చెల్లింపుల వషయంలో కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీకి రూ.4.77 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకుకు రూ.0.71 కోట్లు డిఫాల్డ్‌ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల కాలానికి 10.6 శాతం నుంచి 13 శాతం, యాక్సిస్‌ బ్యాంకు నుంచి 3-7 సంవత్సరాలకు 8.25 శాతం టర్మ్‌ లోన్స్‌ను తీసుకుంది. ఇలా చెల్లింపుల విషయంలో చేసిన పొరపాట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Liquor Consumption: మద్యం వినియోగంలో ఆ రాష్ట్రం ముందుంది.. మరి తెలంగాణ.. తాజా సర్వేలో సంచలన విషయాలు..!

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. డిసెంబర్‌ 1 నుంచి వీటిపై బాదుడు..!

ITR Filing Penalty: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి శుభవార్త.. ఆలస్యమైనా జరిమానా ఉండదు.. ఎవరెవరికి అంటే..!