ఇప్పుడు మార్కెట్లో రూ.2000 వేల నోట్ల ఉప సంహరణ గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నోట్లు కలిగిన వారు ముందస్తుగా బ్యాంకులకు వెళ్లి మార్చుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ గడువు ముగిసిన తర్వాత మీ వద్ద నోట్లు ఉంటే చెల్లుబాటు కావని గుర్తించుకోండి. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం రూ.2000 నోట్లను ముద్రించింది. ఇప్పుడు ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నోట్లపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందన్న ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. ఆర్‌టీఐ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన సమాచారం ప్రకారం.. మొత్తం రూ.7.40 లక్షల కోట్ల విలువైన 370 కోట్లకు పైగా నోట్లను తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.1,300 కోట్లు ఖర్చు చేసింది. ది హిందూ బిజినెస్ ఆన్‌లైన్ ప్రచురించిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మూడు దశల్లో 2,000 రూపాయల నోట్లు అందాయని నివేదికలు చెబుతున్నాయి. రిజ్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 2016-17లో 350.4 కోట్ల నోట్లు రాగా, 2017-18లో 15.1 కోట్ల నోట్లు, 2018-19లో 4.7 కోట్ల నోట్లు వచ్చినట్లు ఆర్బీఐ చెబుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ టిప్ప్ ప్రైవేట్. లీ కంపెనీ ఈ నోట్లను ప్రింట్ చేసి ఆర్బీఐకి ఇచ్చింది.
అయితే ఓ నోట్ ప్రింటింగ్ కంపెనీ రూ.2000 ముఖ విలువ కలిగిన వెయ్యి నోట్లను రూ.4,180కి ఆర్బీఐకి ముద్రణ చేసి ఇచ్చింది. 2016-17లో ఆర్‌బీఐ 1000 నోట్లకు రూ. 3,540 చొప్పున 350.4 కోట్ల నోట్లను విడుదల చేసింది. 2017-18, 2018-19 లో వెయ్యి నోట్లను వరుసగా రూ.4,180, రూ.3,530 గా ముద్రించారు. అంటే ఒక నోటు దాదాపు రూ. 3.50 నుంచి రూ.4.18 వరకు ఖర్చు అయ్యింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రూ.2000 నోట్ల మొత్తం రూ.7.40 లక్షల కోట్లకుపైగా ఉంది. ఆర్‌బీఐ క్రమంగా నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. 2023 మార్చి నెలలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి.
మే నెలలో ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించారు. 93 శాతం వరకు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. ఈ నోట్లను వాపస్ చేసేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అక్టోబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి