Unclaimed Deposits: పిలిచి మరీ డబ్బులిస్తామంటున్న ఆర్బీఐ.. అందుకోసం ప్రత్యేక పోర్టల్.. పూర్తి వివరాలు ఇవి..

|

Aug 20, 2023 | 4:14 PM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను క్లియర్ చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ ను తీసుకొచ్చింది. యూడీజీఏఎం (అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు - గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్)ను ప్రారంభించింది. ఇది పలు బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను కలిగి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకోవవడానికి, నగదు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.

Unclaimed Deposits: పిలిచి మరీ డబ్బులిస్తామంటున్న ఆర్బీఐ.. అందుకోసం ప్రత్యేక పోర్టల్.. పూర్తి వివరాలు ఇవి..
Follow us on

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను క్లియర్ చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ ను తీసుకొచ్చింది. యూడీజీఏఎం (అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు – గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్)ను ప్రారంభించింది. ఇది పలు బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను కలిగి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకోవవడానికి, నగదు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఏప్రిల్ 06, 2023 నాటి డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో భాగంగా క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను శోధించడానికి కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో గత పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు చేయని అకౌంట్ల వివరాలు పొందుపరుస్తారు. దానిలో నుంచి అకౌంట్ హోల్డర్ ఉంటే సరే.. లేకపోతే ఆ ఖాతా దారుడికి చట్టపరమైన వారసులు లేదా ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ ఎవరైనా ఆ డబ్బులను విత్ డ్రా చేసుకొనే వీలుంటుంది. అందుకోసం ఆయా బ్యాంకులకు వెళ్లి అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది. ఆ వివరాలన్నీ యూడీజీఏఎం పోర్టల్లో అందుబాటులో ఉంటాయి.

ఈ బ్యాంకుల్లో వివరాలు..

రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ & అలైడ్ సర్వీసెస్, భాగస్వామ్య బ్యాంకులు యూడీజీఏఎం పోర్టల్‌ను అభివృద్ధి చేయడంలో సహకరించాయి. ప్రస్తుతానికి ఈ యూడీజీఏఎం పోర్టల్ ఏడు బ్యాంకులకు మాత్రమే ఆర్బీఐ యాక్సెస్ ఇచ్చింది. అక్టోబర్ 15 తర్వాత అందుబాటులో ఉంటుంది. ఆ ఏడు బ్యాంకుల వివరాలు ఇవి..

1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ),
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ),
3) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
4) ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్,
5) సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్,
6) డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్,
7) సిటీ బ్యాంక్

ఇవి కూడా చదవండి

ఎలా క్లెయిమ్ చేయాలంటే..

బ్యాంక్ ఖాతా 10 సంవత్సరాల పాటు ఎటువంటి డిపాజిట్ లేదా ఉపసంహరణ కార్యకలాపాలను చూడకుంటే అది ‘క్లెయిమ్ చేయనిది’గా పరిగణించబడుతుంది. వీటిలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఖాతాదారులు బ్యాంకుల్లో ఉన్న తమ అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను యాక్సెస్ చేయడానికి వారి పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఖాతాకు సంబంధించి ఎటువంటి యజమానులు లేకపోతే దానిలోని నగదు డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ (డీఈఏఎఫ్)కి బదిలీ చేయాలి.

అవగాహన కోసం ఆర్బీఐ ప్రత్యేక కార్యక్రమం..

అన్ క్లెయిమ్డ్ ఖాతాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘100 రోజుల్లో 100 చెల్లింపులు’ ప్రచారాన్ని ప్రారంభించింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లను క్లెయిమ్ చేయడానికి వారి సంబంధిత బ్యాంకులను గుర్తించి, సంప్రదించమని ప్రజలకు చెబుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..