Gold Loan: మీ బంగారంపై మరింత లోన్ పొందే అవకాశం.. రూ. 4లక్షల వరకూ పరిమితి పెంపు.. ఆ బ్యాంకులో అవకాశం..

| Edited By: Ravi Kiran

Oct 09, 2023 | 9:10 AM

మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ దగ్గర మొత్తం గోల్డ్ పై అధికమొత్తంలో లోన్ తీసుకొనే వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఆర్బీఐ కొన్ని బ్యాంకులకు పరిమితి కంటే అధిక లోన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించింది. అది ఏ బ్యాంకు? ఎంత పరిమితి పెంచారు? ఎంత వరకూ లోన్ ఇస్తారు? ఎంత కాలంలో లోన్ తిరిగి చెల్లించాలి? తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..

Gold Loan: మీ బంగారంపై మరింత లోన్ పొందే అవకాశం.. రూ. 4లక్షల వరకూ పరిమితి పెంపు.. ఆ బ్యాంకులో అవకాశం..
Gold Loan
Follow us on

మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ దగ్గర మొత్తం గోల్డ్ పై అధికమొత్తంలో లోన్ తీసుకొనే వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఆర్బీఐ కొన్ని బ్యాంకులకు పరిమితి కంటే అధిక లోన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించింది. అది ఏ బ్యాంకు? ఎంత పరిమితి పెంచారు? ఎంత వరకూ గోల్డ్ లోన్ ఇస్తారు? ఎంత కాలంలో లోన్ తిరిగి చెల్లించాలి? తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..

ఏ బ్యాంకులో అంటే..

దేశ వ్యాప్తంగా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ స్కీమ పేరు బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్. దీని ద్వారా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు(యూసీబీ)ల్లో గోల్డ్ లోన్ పరిమితిని రెండు లక్షల రూపాయల నుంచి 4 లక్షల వరకూ పెంచింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ కో ఆపరేటిడ్ బ్యాంకుల్లోని కస్టమర్లకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.

బుల్లెట్ స్కీమ్ ఇలా..

ఈ బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద, యూసీబీలు ఇప్పుడు బంగారం తాకట్టుపై వినియోగదారులకు రూ.4 లక్షల వరకు రుణం ఇవ్వవచ్చు. వినియోగదారులు రుణాన్ని 12 నెలల్లోపు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్య యూసీబీలకు, వారి కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. యూసీబీలు తమ లెండింగ్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోగలుగుతాయి. మరింత ఆదాయాన్ని ఆర్జించగలుగుతాయి, అలాగే కస్టమర్‌లు తక్కువ వడ్డీ రేట్లలో పెద్ద బంగారు రుణాలను పొందగలుగుతారు. ఆర్‌బీఐ నిర్ణయం కూడా ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి, రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ బుల్లెట్ పథకం గురించి ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ దాస్ మాట్లాడుతూ అర్బన్ ఓ ఆపరేటివ్ బ్యాంకులు తమ లక్ష్యాలను అధిగమించాయని చెప్పారు. మార్చి 31, 2023 నాటికి పబ్లిక్ సెక్టార్ లెండింగ్ లక్ష్యాన్ని అధిగమించినట్లు చెప్పారు. అందుకే బుల్లెట్ రీపేమెంట్ పథకం కింద బంగారు రుణాల కోసం అందించే బంగారు రుణ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. తద్వారా యూసీబీలకు ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకున్నట్లు చెప్పారు.

బుల్లెట్ రీపేమెంట్ వర్సెస్ ఈఎంఐ రీ పేమెంట్..

బుల్లెట్ రీపేమెంట్ కింద, రుణగ్రహీత రుణ కాల వ్యవధి ముగిసే సమయానికి రుణంపై అసలు, వడ్డీని ఒకేసారి చెల్లిస్తారు. ఈఎంఐ రీపేమెంట్ కింద, రుణగ్రహీత స్థిరమైన నెలవారీ చెల్లింపును చేస్తాడు, ఇందులో అసలుతో పాటు వడ్డీ కూడా ఉంటుంది.

యూసీబీల్లో బంగారు రుణాలు..

అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లు (యూసీబీ) గోల్డ్ లోన్ మార్కెట్‌లో సాపేక్ష ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే వాటి కస్టమర్‌లు ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వారు. కాబట్టి బంగారు రుణ క్లయింట్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, ఈ విషయంలో రెగ్యులేటరీ ప్రిస్క్రిప్షన్‌లు యూసీబీల కోసం ఈ పోర్ట్‌ఫోలియో వృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గోల్డ్ లోన్ పరిమితి పెంపు వల్ల ప్రయోజనాలు

ఆర్‌బీఐ నిర్ణయం కూడా ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి, రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది. బ్యాంక్ లోన్‌లు లేదా పర్సనల్ లోన్‌లు వంటి ఇతర రకాల క్రెడిట్‌లకు యాక్సెస్ లేని వ్యక్తులకు గోల్డ్ లోన్‌లు ఒక మంచి ఆప్షన్. బంగారు రుణాలు సాపేక్షంగా తక్కువ-ధరతో కూడిన రుణాలు, ఎందుకంటే వడ్డీ రేట్లు సాధారణంగా ఇతర రకాల రుణాలపై వసూలు చేసే వాటి కంటే తక్కువగా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..