RBI Governor Meet: నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశం.. కీలక విషయాలపై చర్చ

|

Nov 16, 2022 | 10:36 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లతో (సీఈఓలు) సమావేశం కానున్నారు..

RBI Governor Meet: నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో ఆర్‌బీఐ గవర్నర్ సమావేశం.. కీలక విషయాలపై చర్చ
Rbi Governor
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లతో (సీఈఓలు) సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో స్లో డిపాజిట్ వృద్ధి, రుణాలకు అధిక డిమాండ్‌ను కొనసాగించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం.. డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 10.2 శాతంతో పోలిస్తే 9.6 శాతం పెరిగాయి. గత ఏడాది 6.5 శాతంతో పోలిస్తే లోన్ ఆఫ్‌టేక్ 17.9 శాతానికి పెరిగింది.

డిపాజిట్ల నెమ్మదిగా వృద్ధితో సహా ధర, స్థిరత్వం గురించి చర్చించబడుతుందని వర్గాలు తెలిపాయి. రిటైల్, సూక్ష్మ, చిన్న, మధ్యస్థ (ఎంఎస్‌ఎంఈ) విభాగంలోని అంశాలపై నాణ్యతను కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల పనితీరును కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మెరుగైన ఆర్థిక పనితీరుకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి మద్దతు లభించడం గమనార్హం. దీనితో పాటు రిటైల్, పరిశ్రమలు, సేవా రంగాలలో కూడా రుణ పంపిణీ పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఆహారేతర క్రెడిట్ వృద్ధి మార్చి 2022లో 8.7 శాతం నుండి సెప్టెంబర్‌లో 16.4 శాతానికి దాదాపు రెట్టింపు అయింది. పరిశ్రమలకు ఇచ్చే రుణాల్లో ఈసీఎల్‌జీ పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాల్లో పెరుగుదల నమోదైంది.

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్‌) కింద అదనంగా రూ.50,000 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆగస్టులో ఆమోదం తెలిపింది. కరోనావైరస్ ద్వారా ప్రభావితమైన ఆతిథ్యం, సంబంధిత పరిశ్రమలకు సరసమైన ధరలకు రుణాలు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం. ఈసీఎల్‌జీఎస్‌ పరిమితిని రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి