AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. అక్టోబర్ నుంచి..

లోన్ రికవరీ ఏజెంట్ల ఇష్టారాజ్యానికి ఆర్బీఐ ముగింపు పలికింది. ఇకపై వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త గైడ్ లైన్ విడుదల చేసింది. అన్ని కమర్షియల్ బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయి. స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులకు ప్రస్తుతం మినహాయించింది.

RBI: బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. అక్టోబర్ నుంచి..
Rbi
Venkatrao Lella
|

Updated on: May 21, 2026 | 1:19 PM

Share

బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిబంధనలు మీరితే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రికవరీ పేరుతో వేధింపులకు గురిచేస్తే సహించేది లేదంటూ ఆర్‌బీఐ హెచ్చరించింది. అయితే పలు ఆర్ధిక సంస్థలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చింది. స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులకు వీటి నంచి మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

పెరుగుతున్న లోన్ రివవరీ ఏజెంట్ల ఆగడాలు

ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు పెరుగుతున్నాయి. బ్యాంకులతో పాటు ఫైనాన్షియల్ సంస్ధలు కస్టమర్లను వేధింపులకు గురి  చేస్తున్నాయి. లోన్ చెల్లించకపోతే బెదిరింపులకు గురి చేస్తున్నాయి. దీనిపై ఆర్బీఐకి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఆర్బీఐ లోన్ రికవరీ ఏజెంట్లకు వేధింపులకు చెక్ పెట్టేందుకు గత కొంతకాలంగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ రూల్స్ వల్ల బ్యాంకుల కస్టమర్లకు ఏజెంట్ల వేధింపులు తగ్గనున్నాయి. లోన్ రివకరీ వేధింపులు అనేవి భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుంది. లోన్‌ను తిరిగి రాబట్టుకోవడంలో బ్యాంకులు సరైన విధానాన్ని పాటించనున్నాయి.

Follow Us