AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు ఇలా..

Horoscope Today (July 11, 2026): శనివారం 12 రాశుల వారికి గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. కొందరికి ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో శుభ పరిణామాలు కనిపిస్తే, మరికొందరు ఆరోగ్యం, ఖర్చులు, నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు ఇలా..
Horoscope Today 11 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 11, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాల.క్షేపం చేస్తారు. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడవద్దు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. పెట్టుబడులకు తగ్గ రాబడి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు పెరుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకపోకలుంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. నిరుద్యో గులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. తలపెట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిసాటిగా సాగుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్ప డుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే సూచనలున్నాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోకుండా పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకూ ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరి స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా కొత్త ఉద్యోగా వకాశాలు అందివస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందు తారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. అయితే, స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగు తుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అను కోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రము ఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ఆహార, విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందినవారికి అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ప్రతిఫలం కూడా ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిం చవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు తగ్గే అవకాశముంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం చేయవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు బాగానే అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. బంధువులకు బాగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు ఆర్థికంగా లాభిస్తాయి.

Follow Us