UPI – Credit Card: క్రెడిట్ కార్డు ఉందా? మీకో శుభవార్త.. యూపీఐ పేమెంట్స్ కూడా చేయవచ్చు.. వివరాలివే!

|

Jun 08, 2022 | 7:20 PM

UPI - Credit Card: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో ఆర్థిక అంశాల్లో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపులు..

UPI - Credit Card: క్రెడిట్ కార్డు ఉందా? మీకో శుభవార్త.. యూపీఐ పేమెంట్స్ కూడా చేయవచ్చు.. వివరాలివే!
Upi Credit Cards
Follow us on

UPI – Credit Card: పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో ఆర్థిక అంశాల్లో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపులు ఊహించని స్థాయిలో పెరిగాయి. యూపీఐ పేమెంట్స్ గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులోకి వచ్చాయి. కిరణా షాపులో వస్తువులు కొనుగోలు చేసినా.. యూపీఐ ద్వారా పేమెంట్స్ జరుపుతున్నారు దేశ ప్రజలు. అయితే, యూపీఐ పేమెంట్స్ విషయంలో మరో కీలక పురోగతి వచ్చింది. క్రెడిట్ కార్డును, యూపీఐతో లింక్ చేసే వెసులుబాటును కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం నాడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది మొదట రూపే క్రెడిట్ కార్డుతో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం యూపీఐ వినియోగదారులు డెబిట్ కార్డులు, సేవింగ్స్/కరెంట్ అకౌంట్స్ యాడ్ చేయడం ద్వారా లావాదేవిలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌ని యూపీఐకి లింక్ చేసే సుదపాయం రావడంతో.. లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి.

UPI యాప్‌లకు ఒకరి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్‌ని యాడ్ చేయడం ద్వారా, POS మెషీన్‌లో స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపు చేయవచ్చు. కేవలం QR కోడ్‌ని స్కాన్ చేసి, చెల్లింపులు చేయడానికి యాడ్ చేసిన క్రెడిట్/డెబిట్ కార్డ్‌ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి UPI యాప్ ద్వారా చెల్లింపులు ప్రారంభించిన తర్వాత, ఆ లావాదేవీలను పూర్తి చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. దాని ఆధారంగా చెల్లింపులు పూర్తవుతాయి.

ఆర్బీఐ గవర్నర్ తెలిపిని వివరాలివే..
‘‘భారతదేశంలో UPI చెల్లింపులు అత్యంత ప్రాముఖ్యత పొందాయి. ప్రస్తుతం, UPI ప్లాట్‌ఫారమ్‌లో 26 కోట్ల మంది ప్రత్యేక వినియోగదారులు, 5 కోట్ల మంది వ్యాపారులు ఆన్‌బోర్డ్‌లో ఉన్నారు. మే 2022లోనే UPI ద్వారా రూ. 10.40 లక్షల కోట్ల మొత్తంలో 594.63 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి. UPI ప్రస్తుతం డెబిట్ కార్డ్‌ల ద్వారా సేవింగ్స్/కరెంట్ ఖాతాలను లింక్ చేయడం ద్వారా వినియోగదారుల లావాదేవీలను సులభతరం చేస్తుంది. PPIల ఇంటర్‌ ఆపరేబిలిటీ కూడా లావాదేవీలను చేపట్టడానికి UPI చెల్లింపు వ్యవస్థకు PPIల యాక్సెస్‌ను సులభతరం చేసింది. రీచ్, వినియోగాన్ని మరింత పెంచే ఉద్దేశ్యంతో UPIకి క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి అనుమతించాలని ప్రతిపాదించడం జరిగింది. మొదట రూపే క్రెడిట్ కార్డ్‌లతో దీనిని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఏర్పాటు UPI ప్లాట్‌ఫారమ్ ద్వారా చెల్లింపులు చేయడంలో వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. అవసరమైన సిస్టమ్ డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత ఈ సౌకర్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం అవసరమైన సూచనలు NPCIకి విడిగా జారీ చేయడం జరుగుతుంది.’’ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, UPI, రూపే కార్డ్‌లు కాకుండా ఇతర ఆప్షన్స్ ద్వారా చేసే ప్రతి లావాదేవీకి, వ్యాపారులు లావాదేవీ మొత్తంలో కొంత శాతాన్ని చెల్లించాలి. ఇది తరువాత బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థల మధ్య విభజించడం జరుగుతుంది. జనవరి 1, 2020న UPI, రూపే ద్వారా చేసే లావాదేవీలపై రుసుమును పూర్తిగా తొలగించారు. అంటే.. యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవన్నమాట. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. ఇక RBI చేసిన తాజా ప్రకటన నేపథ్యంలో.. క్రెడిట్ కార్డ్‌లకు లింక్ చేయబడిన UPI లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఎలా వర్తిస్తుందో స్పష్టంగా తెలియలేదు . ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అత్యధికంగా MDR విధిస్తున్నారు. ఇది 2%-3%కి దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో UPI లింక్డ్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే లావాదేవీలపై బ్యాంకులు MDRని మినహాయించాలా వద్దా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

GPay, PhonePe వంటి ప్రముఖ యాప్‌లలో UPIని ఉపయోగించి క్రెడిట్/ డెబిట్ కార్డ్ ద్వారా ఎలా చెల్లించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
Gpayని ఉపయోగించి క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు జరపడానికి ముందుగా మీరు యూపీఐ యాప్‌కి మీ కార్డులను యాడ్ చేయాలి. GPay వెబ్‌సైట్ ప్రకారం, ఒక వ్యక్తి వీసా, మాస్టర్ కార్డ్ పేమెంట్ గేట్‌వేలలో ఆపరేట్ చేయబడితే, కింది బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను యాడ్ చేయొచ్చు.

1. యాక్సిస్ బ్యాంక్
2. SBI కార్డులు
3. కోటక్ బ్యాంక్
4. HDFC బ్యాంక్
5. ఇండస్‌ఇండ్ బ్యాంక్
6. ఫెడరల్ బ్యాంక్
7. RBL బ్యాంక్
8. HSBC బ్యాంక్
9. ICICI బ్యాంక్
10. OneCard (Visa Credit card) Gpay

యూపీఐ యాప్‌లలో క్రెడిట్, డెబిట్ కార్డ్‌ని ఎలా యాడ్ చేయాలంటే..
1: యాప్‌ని ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయండి.
2: పేమెంట్స్ ప్రాసెస్ పై క్లిక్ చేయాలి. యాప్‌లో ప్రస్తుతం యాడ్ చేసిన బ్యాంక్ ఖాతాలు కనిపిస్తాయి. మరో కార్డ్‌ని యాడ్ చేయడానికి ‘క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ యాడ్’ పై క్లిక్ చేయాలి.
3: మీ కార్డ్ నంబర్, గడువు తేదీ, CVV, కార్డ్ హోల్డర్ పేరు, బిల్లింగ్ చిరునామాను నమోదు చేయాలి. సేవ్ పై క్లిక్ చేయాలి.
4: ఆ తరువాత నిబంధనలు మరియు షరతులను అంగీకరించాలి. స్టోర్‌లలో, వ్యాపారులకు చెల్లించడం ప్రారంభించడానికి ‘యాక్టివేట్’పై క్లిక్ చేయాలి.

గూగుల్ పే ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఎలా?
1. NFC ప్రారంభించిన చెల్లింపు టెర్మినల్స్ & చెల్లింపులపై క్లిక్ చేయాలి.
2. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారుల వద్ద భారత్ పే QR కోడ్ ఆధారిత చెల్లింపులు చేయొచ్చు.
3. Google Payలో బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జ్‌లు చేయొచ్చు.
4. Myntra, Dunzo, Yatra, Magic Pin, Easy My Trip, Appsలో ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు.
5. Paytm, PhonePe, Amazon Pay వంటి ప్లాట్‌ఫారమ్‌లలో Google Payలో చెల్లింపు ప్రక్రియను కూడా ఉపయోగించవచ్చు.

Phone Pay ద్వారా కూడా క్రిడిట్ కార్డు యాడ్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది.