AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రతన్ టాటా ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉంటున్నారో తెలుసా..? నెలకు ఎన్ని లక్షల రెంట్ అంటే..?

ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఒక సంచలన లీజు ఒప్పందం వెలుగులోకి వచ్చింది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా నివాసం ది క్యాబిన్స్ నెలకు లక్షల రూపాయల అద్దెకు లీజుకు ఇవ్వడం జరిగింది. 13,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ సముద్ర తీర బంగ్లా అద్దె వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

రతన్ టాటా ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉంటున్నారో తెలుసా..? నెలకు ఎన్ని లక్షల రెంట్ అంటే..?
Ratan Tata Iconic Colaba Mansion Haleakai Lease Agreement
Krishna S
|

Updated on: Mar 25, 2026 | 9:10 AM

Share

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, దివంగత రతన్ టాటా నివసించిన ముంబైలోని కొలాబా ప్రాంతంలోని అత్యంత విలాసవంతమైన బంగ్లా హలేకై ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. సముద్ర తీరానికి అభిముఖంగా ఉండే ఈ అద్భుతమైన నివాసం ఇప్పుడు అద్దెకు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన లీజు ఒప్పందం, భారీ అద్దె వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

13,200 చదరపు అడుగుల వైభవం..

దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఈ బంగ్లా సుమారు 13,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తుల మేర విస్తరించి ఉన్న ఈ ఇంట్లో ఆధునిక ఇంటీరియర్స్, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. గతంలో దీనిని బఖ్తవార్ అని పిలిచేవారు. 2008లో ప్రఖ్యాత వాస్తుశిల్పి రతన్ బట్లిబోయ్ ఆధ్వర్యంలో ఈ బంగ్లాను సర్వాంగ సుందరంగా పునర్నిర్మించారు.

అద్దె ఎంతో తెలుసా?

జాప్‌కీ నివేదిక ప్రకారం.. ఈ బంగ్లా నెలవారీ అద్దె అక్షరాలా రూ. 17.60 లక్షలుగా ఉంది. ఈ లీజు కోసం రూ. 10 కోట్ల వడ్డీ లేని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. ఒప్పందం కోసం రూ. 4.63 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించడం జరిగింది. ఏప్రిల్ 1, 2027 నుండి ఈ అద్దె 10 శాతం మేర పెరగనుంది.

కొత్త నివాసి ఎవరు?

ఈ విలాసవంతమైన బంగ్లాలోకి రతన్ టాటా సవతి సోదరుడు, ప్రస్తుతం టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా ఉన్న నోయల్ టాటా ప్రవేశించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లీజు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఆయన త్వరలోనే ఈ చారిత్రక నివాసంలోకి మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చారిత్రక నేపథ్యం

ఈ ఆస్తి విలువ ప్రస్తుతం రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఒకప్పుడు నివాసయోగ్యం కాదని ఎంహెచ్‌ఏడీఏ నివేదించిన ఈ భవనాన్ని, టాటా గ్రూప్ ఒక అద్భుతమైన మాన్షన్‌గా తీర్చిదిద్దింది. రతన్ టాటా తన చివరి రోజులను ఇక్కడే గడిపారు, అందుకే ఈ ఇల్లు టాటా కుటుంబానికి ఎంతో భావోద్వేగపూరితమైనది.

Follow Us