AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rapido Success Story: ఐఐటీ చదివి బిజినెస్‌లో 7సార్లు ఫెయిల్.. ర్యాపిడోతో రయ్‌మంటూ దూసుకెళ్తోన్నాడు.. ఇతనెవరో తెలుసా?

Rapido Success Story: కష్టపడి పనిచేసే వారి జాతకం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు.. ఐఐటీ నుంచి చదువు పూర్తి చేసిన ఓ వ్యక్తి విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఐఐటీ చేసి వ్యాపారంలో ఏడు సార్లు ఫెయిల్‌ అయినా పట్టువదలని విక్రమార్కుడిలా చివరకు విజయం సాధించాడు. ఇంతకు ఇతను ఎవరు? ఇతని ప్రస్తుతం..

Rapido Success Story: ఐఐటీ చదివి బిజినెస్‌లో 7సార్లు ఫెయిల్.. ర్యాపిడోతో రయ్‌మంటూ దూసుకెళ్తోన్నాడు.. ఇతనెవరో తెలుసా?
Rapido Success Story
Subhash Goud
|

Updated on: Sep 07, 2024 | 11:00 AM

Share

Rapido Success Story: కష్టపడి పనిచేసే వారి జాతకం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు.. ఐఐటీ నుంచి చదువు పూర్తి చేసిన ఓ వ్యక్తి విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఐఐటీ చేసి వ్యాపారంలో ఏడు సార్లు ఫెయిల్‌ అయినా పట్టువదలని విక్రమార్కుడిలా చివరకు విజయం సాధించాడు. ఇంతకు ఇతను ఎవరు? ఇతని ప్రస్తుతం బిజినెస్‌ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇతని పేరు పవన్ గుంటుపల్లి. మొదట విదేశాల్లో పనిచేసినా అక్కడ పనిచేయాలని అనిపించలేదు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడు. లక్షల రూపాయల జీతంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి దేశానికి వచ్చి రెండేళ్లుగా కొత్త ఆలోచనలు చేస్తూనే 7 సార్లు ఫెయిల్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.416 పెట్టుబడితో కోటి రూపాయలు.. సూపర్‌ డూపర్‌ ప్లాన్‌!

ఇన్ని సార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా పట్టు వదలలేదని పవన్ గుంటుపల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చుట్టుపక్కల వారు తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పుకునేవారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారట. చివరగా అతను ఒక అద్భుతమైన ఆలోచనతో క్యాబ్ అందించే కంపెనీని ప్రారంభించే సమయం వచ్చింది. ఈ సంస్థ మరెవరో కాదు, రాపిడో. నేడు అనేక నగరాల్లో బైక్ నుండి క్యాబ్ వరకు సేవలను అందిస్తుంది. ఇప్పుడు ఇది పెద్ద విజయాన్ని సాధించింది.

రాపిడో యునికార్న్ :

రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ అవుతుంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలోని సిరీస్ E ఫండింగ్‌లో రాపిడో $200 మిలియన్లను పొందింది. ఈ కొత్త పెట్టుబడితో Rapido పోస్ట్-మనీ వాల్యుయేషన్ $1.1 బిలియన్లకు చేరుకుంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీ యునికార్న్ క్లబ్‌లో చేరిపోయింది. రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ సంకా మాట్లాడుతూ.. మూలధనం ఈ కొత్త పెట్టుబడితో మా ఆఫర్‌ను అన్వేషించడానికి, విస్తరించడానికి తాము ఆసక్తిగా ఉన్నాము. తద్వారా మా కస్టమర్ల పెరుగుతున్న అవసరాలను తీర్చగలమని అన్నారు.

ఇది కూడా చదవండి: Parle Biscuit: పార్లే-జీ బిస్కెట్‌ ప్యాకెట్‌పై ఉండే పాప ఫోటో ఎవరిదో తెలుసా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ మేనేజర్‌!

స్టార్టప్‌లో 6 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ర్యాపిడో తన స్నేహితుడు అరవింద్ సంకాతో కలిసి ‘ది కారియర్’ ప్రారంభించాడు . అతను మినీ ట్రక్కులను ఉపయోగించి ఇంటర్‌సిటీ లాజిస్టిక్స్ సేవలను అందించేవాడు. కానీ ఈ వ్యాపారం కూడా జరగలేదు. ట్రాఫిక్‌ జామ్‌, పాత వ్యాపారం విఫలమవడంతో పవన్‌ గుంటుపల్లికి బైక్‌ క్యాబ్‌ సర్వీస్‌ ఎందుకు ప్రారంభించకూడదనే ఆలోచన వచ్చింది. అతను తన స్నేహితులైన అరవింద్ సంక, రిషికేష్ ఎస్‌ఆర్‌తో కలిసి 2015 సంవత్సరంలో రాపిడో (Rapido)ని ప్రారంభించాడు. ఈ కంపెనీ బైక్ నుండి టాక్సీ వరకు సౌకర్యాలను అందించడానికి ప్రారంభించబడింది. నేడు ఈ కంపెనీ విలువ రూ. 9237 కోట్లు ($1.1 బిలియన్).

Ola-Uberతో పెద్ద పోటీ ఏర్పడింది:

Rapido ప్రారంభించినప్పుడు Ola, Uber క్యాబ్‌లను అందించడంలో ముందున్నాయి. వారు కారు, టాక్సీ సేవలను మాత్రమే అందించేవారు. మరోవైపు, బైక్‌ల గురించి ప్రజలకు తక్కువ తెలుసు. పవన్ గుంటుపల్లి బెంగళూరు నుంచి ర్యాపిడోను ప్రారంభించారు. ఇందుకోసం బేస్ ఫేర్ రూ.15గా ఉంచి ఆ తర్వాత కిలోమీటరుకు రూ.3 చొప్పున వసూలు చేశారు. కానీ ఇంత చేసినా సక్సెస్ రాలేదు. రాపిడో బైక్ సర్వీస్‌తో పాటు క్యాబ్ సర్వీస్‌ను ప్రారంభించింది. రాపిడో ప్రారంభించిన ఒక నెల తర్వాత ఉబెర్‌, ఓలా కూడా తమ బైక్ సేవలను ప్రారంభించారు. దీని కారణంగా పెద్ద పెట్టుబడిదారులు రాపిడోలోకి రావడానికి భయపడటం ప్రారంభించారు.

రాపిడో మార్కెట్ లీడర్‌గా ఎలా మారింది?

2016 సంవత్సరంలో రాపిడోకు హీరో మోటోకార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ మద్దతు లభించింది. అతని తర్వాత అడ్వాంట్ఎడ్జ్, మరికొందరు కూడా చేరారు. ఇప్పుడు రాపిడో బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్‌లలో 400 బైక్‌లను విడుదల చేసింది. జనవరి 2016 నాటికి కంపెనీకి 5000 మంది వినియోగదారులు ఉండగా, డిసెంబర్ 2016 నాటికి ఈ సంఖ్య 1,50,000కి పెరిగింది. నేడు రాపిడో తన పరిధిని మెట్రో నగరాలకు విస్తరించింది. దేశంలోని టైర్ 2, 3 నగరాలతో సహా 100కి పైగా నగరాల్లో తన ఉనికిని నెలకొల్పింది. ఈ రంగంలో అగ్రగామిగా నిలిచింది.

పవన్ తెలంగాణ బిడ్డనే..

తెలంగాణకు చెందిన పవన్ గుంటుపల్లి విజయం వెనుక పట్టుదల, సంకల్పం, వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్నాయి. చిన్న వయస్సులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ట్రేడింగ్ నేర్చుకున్నాడు. ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఉన్నత చదువుల సమయంలో భవిష్యత్తు కోసం నైపుణ్యాలను పెంచుకున్నాడు. అలా సామ్‌సంగ్‌ కంపెనీలో కొంతకాలం పనిచేసిన తర్వాత పవన్ తన మిత్రుడు అరవింద్ సంకా మినీట్రక్కుల వినియోగం ద్వారా ఇంటర్‌సిటీ లాజిస్టిక్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన “ది కారియర్” అనే కంపెనీని ప్రారంభించారు. అలా వారి వ్యాపార ప్రయాణం మెుదలైంది.

అయితే 2014లో రాపిడో పేరుతో ప్రారంభించిన బైక్ టాక్సీ సర్వీస్ వ్యాపారం మెుదట్లో అనేక ఎదురుదెబ్బలు తింది. అయితే వీటితో కుంగిపోని పవన్ బృందం ముందుకే సాగింది. తమ ఆలోచనకు ఫండింగ్ కోసం చేసిన ప్రయత్నాలు దాదాపు 75 మంది పెట్టుబడిదారుల నుంచి తిరస్కరణకు గురైంది. మార్కెట్లో పెద్ద ఆటగాళ్లతో రాపిడో పోటీపడటం అసాధ్యంగా ఇన్వెస్టర్లు భావిచటంతో పెట్టుబడి పెట్టేందుకు నిరాకరించారు. రైడ్ హెయిలింగ్ వ్యాపారంలో ఓలా, ఉబెర్ నియంత్రణలో ఉన్న మార్కెట్లో ఉబెర్ బతకలేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నింటినీ పక్కనపెట్టి పవన్.. పట్టుదలతో తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లి ఎట్టకేలకు విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Jio: జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.122ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా.. పూర్తి వివరాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి