టాటా మోటార్స్‌ రక్షా బంధన్ స్పెషల్‌.. భారతదేశ ట్రక్కింగ్ హీరోలకు రాఖీ లేఖలు!

టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్, రక్షా బంధన్ సందర్భంగా ట్రక్ తయారీదారులు డ్రైవర్ల మధ్య అరుదైన అనుబంధాన్ని సృష్టించాయి. జంషెడ్‌పూర్ ప్లాంట్‌లోని మహిళలు ట్రక్ డ్రైవర్లకు హృదయపూర్వక లేఖలు, రాఖీలు పంపారు. ఈ క్యాంపెయిన్ ట్రక్కుల నిర్మాణంలోని మానవీయ అంశాన్ని ప్రతిబింబిస్తుంది, భావోద్వేగాలను ప్రాధాన్యతగా చూపుతుంది.

టాటా మోటార్స్‌ రక్షా బంధన్ స్పెషల్‌.. భారతదేశ ట్రక్కింగ్ హీరోలకు రాఖీ లేఖలు!
Tata Motors Raksha Bandhan

Edited By: Janardhan Veluru

Updated on: Aug 12, 2025 | 12:23 PM

ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్‌ డ్రైవర్లు,‍ వాటిని తయారు చేసేవారు చాలా అరుదుగా కలుస్తారు. కానీ ఈ రక్షా బంధన్ టాటా మోటార్స్ వెహికల్స్‌, TV9 నెట్‌వర్క్ ఆ అంతరాన్ని తగ్గించింది. భావోద్వేగం, నమ్మకం, హృదయపూర్వక వ్యక్తీకరణతో ఆ దూరాన్ని దగ్గర చేశాయి. ‘రక్షా బంధన్ – టాటా ట్రక్కులు, దేశపు ట్రక్కులు’ క్యాంపెయిన్‌లో భాగంగా టాటా మోటార్స్ జంషెడ్‌పూర్ ప్లాంట్‌లోని దుర్గా లైన్ నుండి మహిళలు వారు సమీకరించే ట్రక్కుల డ్రైవర్లకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు. ఇవి సాధారణ లేఖలు కావు.. రక్షణ, గౌరవం, “ఏక్ అంజాన్ భాయ్ కే నామ్” అంటూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన లేఖలు.

ప్రతి సందేశాన్ని చేతితో రాసి, రాఖీతో ప్యాక్ చేసి, ప్లాంట్‌ను ఎప్పుడూ సందర్శించని ట్రక్ డ్రైవర్లకు పంపారు. ఈ లేఖల ద్వారా ప్రతి టాటా ట్రక్కులో భద్రత, విశ్వసనీయతను రూపొందించే ఈ మహిళలు – భావోద్వేగ భద్రతను, భారతదేశ పురోగతిని నడిపించే పురుషులతో సంఘీభావాన్ని వాగ్దానం చేశారు. యంత్రాలు భారాన్ని మోయగలిగినప్పటికీ, భావోద్వేగాన్ని మోసేది ప్రజలు, బిల్డర్లు, డ్రైవర్లు అని ఈ చొరవ గుర్తు చేస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి