Rabbit Farming: కొంతమంది ఉన్నదానితో సరిపెట్టుకుని ప్రశాంతంగా బతికేద్దామని అనుకుంటారు. మరికొందరు ఏదైనా సాధించాలని.. తమకంటూ ఓ గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఉద్యోగంలో వచ్చే జీతంతో బతికేవారు కొందరు ఐతే.. వ్యాపార రంగంలో అడుగు పెట్టి.. రాణించడమే కాదు.. మరికొంతమందికి పని కల్పించేవారు ఇంకొందరు. అయితే మారుతున్న కాలం.. పెరుగుతున్న అవసరాలు..దృష్ట్యా ఎటువంటి వ్యాపారం చేస్తే లాభాలను ఆర్జిస్తామని కొంతమంది ఆలోచిస్తుంటారు. కొంచెం కష్టబడితే.. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించే వ్యాపారం కుందేళ్ళ పెంపకం. ఈ వ్యాపారం చేస్తే మంచి లాభాలు పొందొచ్చు. ఇక వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలోకి వెళ్తే..
ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలంటే మీ సేవ కేంద్రానికి వెళ్లి కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ పేరు మీద సదరు వ్యక్తికీ ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. ఈ కుందేళ్ళ పెంపకానికి కావాలంటే ముద్ర స్కీమ్ నుండి రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ తీసుకోవచ్చు.
మొదట చిన్నగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఓ 50 కుందేళ్ళను పెంచుకోవచ్చు. దీనికి కొద్దిగా స్థలం కావాలి. అంటే కుందేళ్లు పెరిగే సైజు కంటే రెట్టింపు స్థలం ఉంటే చాలు. 50 కుందేళ్ళ పెంపకానికి రూ.4000 పెట్టుబడి పెడితే కుందేళ్లు వచ్చేస్తాయి. కుందేళ్ళకు ఆహారంగా ఎండిన గడ్డి, క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర, క్యాలీఫ్లవర్ ఆకులు వంటివి కావాలి. నీటిని పెట్టడానికి చిన్న చిన్న నీటి తొట్టెలు.. ఉండాలి.
కుందేళ్లు సంవత్సరానికి నాలుగు సార్లు పిల్లల్ని పెడతాయి. ఒక్కో కుందేలూ ఆరు పిల్లలు పెడుతుంది. ఈ కుందేళ్ళ ఫర్ ని క్లాత్ ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు. ఇళ్లలో పెంచుకోవడానికి కుందేళ్లను కొనుక్కుంటారు. తక్కువ శ్రమ తక్కువ పెట్టుబడితో లాభసాటిగా ఈ కుందేళ్ళ పెంపకం బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఆదాయం పొందొచ్చు.
Also Read: నరాల సంబంధం ఇబ్బందులు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారా కర్పూరం వాడితే సరి..!