డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను తీసుకువచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్ కారణంగా గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, గ్యాస్ సిలిండర్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. క్యూఆర్ కోడ్ ని స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా సదరు సిలిండర్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ కోడ్ సిలిండర్‌కి ఆధార్ కార్డ్‌లా పని చేస్తుందని, డొమెస్టిక్ సిలిండర్ల నియంత్రణకు ఇది దోహదపడుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇది విప్లవాత్మకమైన మార్పు అని పేర్కొన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 20,000 ఎల్‌పిజి సిలిండర్లకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రానున్న మూడు నెలల్లో అన్ని 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్లు క్యూఆర్ కోడ్‌తో వస్తాయని, అన్ని పాత సిలిండర్లపై ప్రత్యేక స్కిక్కర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్రమంత్రి.
1. స్మార్ట్‌ఫోన్‌తో గ్యాస్ సిలిండర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయొచ్చు.
2. స్కాన్ చేసిన తరువాత స్క్రీన్‌పై సిలిండర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది.
3. సిలిండర్ పంపిణీదారు ఎవరు? ఎక్కడి నుండి సరఫరా అయ్యిందో కూడా అందులో కనిపిస్తుంది.
4. సిలిండర్ ఎప్పుడు, ఎక్కడ విడుదలైంది. దాని డెలివరీ బాయ్ ఎవరో కూడా కస్టమర్‌కు తెలుస్తుంది.
5. ప్లాంట్ నుండి ఇంటికి చేరే మొత్తం ప్రయాణాన్ని స్క్రీన్‌పై చూడొచ్చు.
6. గ్యాస్ సిలిండర్ బరువు, గడువు తేదీ వంటి పూర్తి వివరాలను కూడా మీరు స్క్రీన్‌పై చూడవచ్చు.
1. గ్యాస్ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ సహాయంతో వినియోగదారుడు సిలిండర్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
2. సిలిండర్ బరువు, గడువు తేదీ వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
3. ఈ సిలిండర్ ఎక్కడ ఫిల్ చేశారో కూడా తెలుసుకోవచ్చు.
4. వినియోగదారులు చాలాసార్లు తమ గ్యాస్ సిలిండర్ పంపిణీదారుని గుర్తించడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సందర్భంలో QR కోడ్ ద్వారా.. తమ సిలిండర్ పంపిణీదారు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
5. క్యూఆర్ కోడ్ ద్వారా గ్యాస్ సిలిండర్ భద్రతా పరీక్షలు జరిగాయా? లేదా? అనే వివరాలు కూడా తెలుపుతుంది.
6. క్యూఆర్ కోడ్ సహాయంతో గ్యాస్ సిలిండర్ల దొంగతనం, హోర్డింగ్‌ను నిరోధించవచ్చు.
Fueling Traceability!
A remarkable innovation – this QR Code will be pasted on existing cylinders & welded on new ones – when activated it has the potential to resolve several existing issues of pilferage, tracking & tracing & better inventory management of gas cylinders. pic.twitter.com/7y4Ymsk39K— Hardeep Singh Puri (@HardeepSPuri) November 16, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..