Multiplex Business: ఆ రెండు సంస్థల విలీనం.. డీల్ జరిగితే సినిమా వ్యాపారంలో పెను మార్పే..

|

Mar 08, 2022 | 7:39 AM

PVR-CINEPOLIS: మల్టీప్లెక్స్‌ వ్యాపార(Multiplex Business) సంస్థలు పీవీఆర్‌, సినీపొలిస్‌ ఇండియాలు విలీన చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

Multiplex Business: ఆ రెండు సంస్థల విలీనం.. డీల్ జరిగితే సినిమా వ్యాపారంలో పెను మార్పే..
Multiplex
Follow us on

PVR-CINEPOLIS: మల్టీప్లెక్స్‌ వ్యాపార(Multiplex Business) సంస్థలు పీవీఆర్‌, సినీపొలిస్‌ ఇండియాలు విలీన చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ సంస్థల విలీనం జరిగితే భారత మల్టీప్లెక్స్‌ రంగంలో కేవలం రెండు కంపెనీలే రాజ్యమేలే(Monopoly) పరిస్థితి వస్తుందని.. ఈ రంగంలో పెను మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా పీవీఆర్‌కు సంస్థకు 846 తెరలు ఉండగా.. సినీపొలిస్‌కు 417 స్కీన్స్ ఉన్నాయి. ఈ రెండిటి కలయిక వల్ల ఏర్పడే సంస్థకు 1263 తెరలు కలిగిన అతి పెద్ద సంస్థగా అవతరిస్తుంది. విలీన కంపెనీలో సినీపొలిస్‌కు 20శాతం వాటా.. పీవీఆర్‌ ప్రమోటర్లకు 10-14 శాతం వాటా ఉంటుందని కొన్ని మీడియా వర్గాల కథనాల ప్రకారం తెలుస్తోంది. విలీన సంస్థపై తొలి మూడేళ్ల పాటు ప్రస్తుత పీవీఆర్‌ సీఎండీ అజయ్‌ బిజ్లీకి యాజమాన్య నియంత్రణ ఉండనున్నట్లు తెలుస్తోంది.

దేశంలోనే మూడో అతిపెద్ద మల్టీప్లెక్స్‌ కంపెనీ, మెక్సికన్‌ థియేటర్‌ చైన్‌ అనుబంధ సంస్థ అయిన సినీపొలిస్‌ ఇండియాతో పీవీఆర్‌ విలీనం అయితే..విలీన సంస్థకు సినిమా వ్యాపారంలో 35-37 శాతం వాటా దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో తెరకు రూ.9 కోట్ల చొప్పున సినీపొలిస్‌ను లెక్కగట్టే అవకాశం ఉండగా.. పీవీఆర్‌తో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ అని తెలుస్తోంది. కానీ ఈ వార్తలపై రెండు కంపెనీల ప్రతినిధులు ఇప్పటి వరకు స్పందించలేదు ఎంటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

విలీన కంపెనీకి మల్టీప్లెక్స్‌ విభాగంలో 42శాతం వాటా.. మొత్తం భారత సినిమా తెరల్లో 15% వాటా దక్కవచ్చు. అయితే మల్టీప్లెక్స్‌ వరకు చూస్తే పీవీఆర్‌+సినీపొలిస్‌, ఐనాక్స్‌ లీజర్‌లు కలిసి బాక్సాఫీసు ఆదాయంలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి. అంటే భారత మల్టీప్లెక్స్‌ వ్యవస్థలో రెండు సంస్థలు కీలకంగా మారనున్నాయన మాట. 2018లో ఐనాక్స్‌, సినీపొలిస్‌ మధ్య విలీన చర్చలు జరిగినప్పటికీ అవి విజయవంతం కాలేదు. అదే ఏడాదిలో సినీపొలిస్‌ 500 కొత్త స్కీన్లను యాడ్ చేయటం కోసం రూ.1500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 2022 కల్లా భారత్‌లో తెరల సంఖ్యను 600కు చేరుస్తామని 2019లో తెలిపింది.

దక్షిణాదిన.. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో నలుగురయిదుగురు సూపర్‌స్టార్లు ఉన్నారు. వీరు పాన్‌ ఇండియా స్టార్లుగా మారుతున్నారు. కాబట్టి నిర్మాతలు ఎక్కువ తెరలపై తమ సినిమాను విడుదల చేయడానికి చూస్తుంటారు. ఇది కూడా స్కీన్ల సంఖ్య పెరగటానికి మరో కారణమని తెలుస్తోంది. మల్టీప్లెక్స్‌ సంస్థల పోటీ తగ్గడం వల్ల తెరలపై పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందనీ పేర్కొన్నారు. పీవీఆర్‌కు ఉత్తర భారత్‌లో వ్యాపారం ఎక్కువగా ఉండగా.. మరో వైపు సినీపొలిస్‌కు మెట్రోయేతర నగరాల్లో అధిక తెరలున్నాయి. సినీపొలిస్‌ చేతికి నియంత్రణ వెళితే పీవీఆర్‌తో సంబంధాలు బాగున్న మాల్‌ డెవలపర్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న వాదనా ఉంది. ఏదేమైనా ఈ డీల్ పూర్తయితే సినిమాల ప్రదర్శించే మల్టీ ప్లెక్స్ ల వ్యాపారంలో పెనుమార్పులు రానున్నాయి.

ఇవీ చదవండి..

Indians stocking: భయంతో వాటిని ఎక్కువ కొంటున్న భారతీయులు.. నిపుణులు ఏమంటున్నారంటే..

Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ మంత్రి కూతురు.. తండ్రి నుంచి రక్షణ కావాలంటూ పోలీసులకు విజ్ఞప్తి..