Personal Loan: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక రుణం పొందేందుకు ప్రత్యేక సదుపాయం..!

|

Jul 05, 2022 | 3:11 PM

Personal Loan: బ్యాంకులు తమ తమ కస్టమర్లకు రుణ సదుపాయాన్ని సులభతరం చేస్తోంది. బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు ఫారాలను పూరించకుండానే ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌..

Personal Loan: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక రుణం పొందేందుకు ప్రత్యేక సదుపాయం..!
Bank Loan
Follow us on

Personal Loan: బ్యాంకులు తమ తమ కస్టమర్లకు రుణ సదుపాయాన్ని సులభతరం చేస్తోంది. బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు ఫారాలను పూరించకుండానే ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ ద్వారా నిమిషాల్లోనే రుణాన్ని పొందే విధంగా సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రుణాన్ని సులభంగా పొందేందుకు ఓ ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది. మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉండి రుణం కావాలనుకుంటే పొందేందుకు ఆస్కారం ఉంటుంది. తమ బ్యాంకులో ఖాతా ఉన్న వారు నిమిషాల్లోనే లోన్‌ సదుపాయం పొందవచ్చని బ్యాంకు ట్వీట్‌ చేసింది. కేవలం నాలుగు క్లిక్‌లతోనే మీరు రుణాన్ని పొందవచ్చని తెలిపింది. ఎలాంటి దరఖాస్తు ఫారాలు నింపకుండానే రుణ సౌకర్యం పొందవచ్చని తెలిపింది. కేవలం ఓటీపీ ద్వారానే ముందుగా ఆమోదించబడిన వ్యక్తిగత రుణం పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం కొన్ని వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మీకు రుణాన్ని మంజూరు చేస్తుంది బ్యాంకు.

 

ఇవి కూడా చదవండి


పేపర్‌లెస్-ప్రీ అప్రూవ్డ్ లోన్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ట్వీట్‌లో తెలిపింది. మీరు చేయాల్సిందల్లా OTPని నమోదు చేయడమే. దీంతో నిమిషాల్లో లోన్ పొందుతారు.

రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

☛ ముందుగా మీరు PNB One యాప్ హోమ్ పేజీకి వెళ్లాలి.

☛ ఇక్కడ మీరు ఆఫర్‌ల ఎంపికను ఎంచుకోవాలి.

☛ దీని తర్వాత మీరు మీ అన్ని వివరాలను నిర్ధారించాలి. క్లిక్‌ చేయాలి.

☛ మీకు కావాల్సిన లోన్ మొత్తాన్ని నమోదు చేయాలి.

☛ ఇప్పుడు మీరు అన్ని నిబంధనలు, షరతులను చదివి అంగీకరించు, ప్రాసెస్ చేయడంపై క్లిక్‌ చేయండి.

☛ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

☛ OTPని నమోదు చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయండి.

☛ ఇప్పుడు మీ లోన్ అప్లికేషన్ పూర్తయింది. తర్వాత బ్యాంకు వాళ్లు పూర్తి వివరాలను పరిశీలించి మీకు లోన్‌ను మంజూరు చేస్తారు. ఇలా ఇంట్లో ఉండే మీ రుణ దరఖాస్తును పూర్తి చేసుకోవచ్చు. మీకు అర్హత ఉంటే వెంటనే రుణం మంజూరు చేస్తుంది సదరు బ్యాంకు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి