PNB online training: మహిళలకు పంజాబ్ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఉచితంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమం.. అందుబాటులోకి కొత్త పథకం

దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది.

PNB online training: మహిళలకు పంజాబ్ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఉచితంగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమం..  అందుబాటులోకి కొత్త పథకం
Empowering Women Through Entrepreneurship' By Pnb
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 13, 2021 | 7:53 PM

దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. పీఎన్‌బీ ద్వారా మహిళలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు వ్యాపార శిక్షణ ఇవ్వడం, తద్వారా వారు విజయవంతమైన వ్యాపార మహిళలుగా మారేందుకు దోహదపడుతోందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందు కోసం మహిళల నుండి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. ఇది పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. కాగా, పీఎన్‌బీ కార్యక్రమానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమం నుండి లబ్ది పొందాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.

దరఖాస్తు చేసుకునే విధానం

ఈ కార్యక్రమం కింద పీఎన్‌బీ దరఖాస్తు అవకాశం కల్పిస్తుంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) కూడా సహకరిస్తోందని వివరించింది. పీఎన్‌బీ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వ్యవస్థాపకత ద్వారా మహిళలను సాధికారకం అభివృద్ధి సాధించవచ్చని తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అదనపు సమాచారం మీకు అవసరమైతే, మీరు ఇచ్చిన లింక్‌ను (https://innovateindia.mygov.in/ncw-challenge) సందర్శించవచ్చు.

ఎంత మంది మహిళలకు అవకాశం లభిస్తుంది

పీఎన్‌బీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన 5,000 మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మొత్తం ప్రోగ్రామ్ 6 వారాల వ్యవధిలో ఉన్న కోర్సుగా అమలు చేస్తోంది. ఎన్‌సిడబ్ల్యుతో పాటు, పీఎన్‌బీ ఒక కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు (ఐఐఎం), ఎస్‌ఎంఇ ఫోరం ఇండియాకు కూడా మద్దతు ఇస్తుంది. వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటున్న 5,000 మంది మహిళలకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పంజాబ్ బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకునే అర్హతలుః

1. ఈ కోర్సులో ఎంపికయ్యే ప్రతి మహిళ ప్రతిరోజూ ఇక్కడ 3-4 గంటల సమయం ఇవ్వాలి. 2. దరఖాస్తుదారుడు 18 ఏళ్లు పైబడి ఉండాలి. 3. మహిళలు భారతీయులు అయ్యిండాలి. 4. ఈ ప్రోగ్రామ్ కోసం తమ వ్యాపారానికి సంబంధించి ఒక వీడియోను పంపాల్సి ఉంటుంది. 5. ఈ వీడియోలు కనీసం 5 నిమిషాల నిడివి ఉండాలి. 6. ఈ వీడియోల ద్వారా మీరు ఏ భాషలోనైనా హిందీ లేదా ఆంగ్ల భాష చేయవచ్చు. 7. వీడియోను యూట్యూబ్ లేదా విమియో ద్వారా పంపాలి. 8. భారతదేశం నలుమూలల నుండి మహిళలు పాల్గొనవచ్చు.

శిక్షణ విధానంః

ఈ కార్యక్రమంలో ఎంపికైన మహిళలకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు (ఐఐఎం) ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వబడుతుంది. మీకు ఇష్టమైన వ్యాపారానికి సంబంధించిన సమాచారం, శిక్షణ తీసుకొని ప్రతి నెలా బలమైన ఆదాయాన్ని సంపాదించడం ద్వారా మీరు విజయవంతమైన వ్యాపార మహిళ కావచ్చు. ‘డు యువర్ వెంచర్’ ఆలోచన కింద వ్యాపారం చేసే మార్గాన్ని చూపిస్తోంది. ఈ కార్యక్రమం కింద భారతదేశం నలుమూలల నుండి మహిళలు పాల్గొనవచ్చు.

Read Also…  Banks Privatisation: బ్యాంకుల ప్రయివేటీకరణపై రేపు కీలక సమావేశం.. ఆ రెండు ప్రభుత్వ బ్యాంకులు ఇక ప్రయివేట్ కావచ్చు!

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్