AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తి పత్రాల్లో అక్షర దోషాలు ఉంటే ఏమవుతుంది? భవిష్యత్తులో ఈ సమస్యలు వస్తాయా?

ఆస్తి పత్రాలలో చిన్న అక్షర దోషాలు భవిష్యత్తులో తీవ్రమైన చట్టపరమైన సమస్యలకు దారితీస్తాయి. రిజిస్ట్రేషన్, ఆస్తి అమ్మకం, బ్యాంక్ లోన్ పొందే సమయంలో అడ్డంకులు సృష్టిస్తాయి. వారసత్వ ఆస్తుల విషయంలో వివాదాలకు కారణమవుతాయి. పన్ను చెల్లింపులు, మ్యూటేషన్ ప్రక్రియలు ఆలస్యం కావచ్చు.

ఆస్తి పత్రాల్లో అక్షర దోషాలు ఉంటే ఏమవుతుంది? భవిష్యత్తులో ఈ సమస్యలు వస్తాయా?
Property Document
SN Pasha
|

Updated on: Apr 30, 2026 | 4:48 PM

Share

ఆస్తి కొనుగోలు సమయంలో పత్రాల్లో చిన్న అక్షర దోషాలు పెద్ద సమస్య కాదనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే న్యాయ నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఇలాంటి చిన్న తప్పులు భవిష్యత్తులో గంభీరమైన చట్టపరమైన ఇబ్బందులకు దారి తీసే అవకాశముంది. భూమి లేదా ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేరు, తండ్రి పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం వంటి వివరాల్లో ఒక అక్షరం తప్పినా, అది ఆస్తి యాజమాన్యాన్ని నిర్ధారించే సమయంలో సందేహాలకు కారణమవుతుంది. ఉదాహరణకు యజమాని పేరులో స్పెల్లింగ్ తేడా ఉంటే, బ్యాంక్ లోన్ పొందడం లేదా ఆస్తిని అమ్మడం సమయంలో అడ్డంకులు ఏర్పడవచ్చు. కొనుగోలుదారులు కూడా ఇలాంటి పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.

ముఖ్యంగా వారసత్వంగా వచ్చే ఆస్తుల విషయంలో ఈ సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఒక అక్షర దోషం కారణంగా కోర్టులో కేసులు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ రికార్డులు, పన్ను పత్రాల్లో ఉన్న వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సరిపోలకపోతే, మ్యూటేషన్, పన్ను చెల్లింపులు వంటి ప్రక్రియలు ఆలస్యమవుతాయి. ఇది ఆస్తి యజమానికి అదనపు సమయం, ఖర్చు భారాన్ని మోపుతుంది.

ఈ నేపథ్యంలో ఆస్తి కొనుగోలు లేదా రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత అవసరం. తప్పులు గుర్తిస్తే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే లీగల్ నిపుణుల సహాయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి చిన్న అక్షర దోషాలు కూడా పెద్ద సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉన్నందున, ఆస్తి పత్రాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us