Bank News: ఖాతాదారులకు షాకిచ్చిన HDFC బ్యాంక్.. ఆ లోన్ల వడ్డీ రేట్లు పెంపు..

Bank News: మీరు సొంతిల్లు కొనాలని అనుకుంటున్నారా? ఇందుకోసం బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ తీసుకుందామనుకుంటున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్.

Bank News: ఖాతాదారులకు షాకిచ్చిన HDFC బ్యాంక్.. ఆ లోన్ల వడ్డీ రేట్లు పెంపు..
HDFC
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 02, 2022 | 7:42 AM

Bank News: మీరు సొంతిల్లు కొనాలని అనుకుంటున్నారా? ఇందుకోసం బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ తీసుకుందామనుకుంటున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్. హౌసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ బ్యాంక్ (HDFC Bank) తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఐదు బేసిక్ పాయింట్లు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) పెంచుతున్న‌ట్లు తెలిపింది. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటనను బ్యాంక్ విడుదల చేసింది. పెంచిన వడ్డీరేట్లు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తాయని HDFC బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ మేరకు.. బ్యాంక్ హోమ్ లోన్ల‌పై వ‌డ్డీరేట్లు ఆర్పీఎల్ఆర్‌కు అనుగుణంగా స‌ర్దుబాటు అయ్యాయి. రూ.30 ల‌క్ష‌ల్లోపు రుణాల‌పై 6.80 శాతం, రూ.30-75 ల‌క్ష‌ల్లోపు రుణాల‌పై 7.05 శాతం, రూ.75 ల‌క్ష‌లకు పైగా రుణాల‌పై 7.15 శాతం వ‌డ్డీరేటు వసూలు చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అన్ని సెగ్మెంట్ల‌లో మ‌హిళా క‌స్ట‌మ‌ర్ల‌కు ఐదు బేసిక్ పాయింట్ల మేర వ‌డ్డీరేటులో రాయితీ ఉంటుందని HDFC బ్యాంక్ పేర్కొంది. ఎస్బీఐ(SBI) గ‌త నెల 15 నుంచి 10 పాయింట్ల ఎంసీఎల్ఆర్‌, యాక్సిస్ బ్యాంక్ ఐదు బేసిక్ పాయింట్లు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఐదు బేసిక్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచేశాయి.

ఈ క్రమంలో సిబిల్ (క్రెడిట్‌) స్కోర్ 750 పాయింట్ల‌పై చిలుకు ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌కు 6.70 శాతం వ‌డ్డీరేటుపై HDFC గృహ రుణాలను మంజూరు చేయనుంది. ఇప్పటికే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI), బ్యాంకు ఆఫ్ బరోడా(BOB) వంటి బ్యాంకులు లెండింగ్ రేట్లను పెంచేశాయి. ఇతర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుకు అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ కూడా తన లోన్ రేట్లను పెంచింది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం కారణంగా మరిన్ని బ్యాంకులు ఇదే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. వచ్చే దవ్య పరపతి సమావేశంలో రిజర్వు బ్యాంక్ కూడా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవీ చదవండి..

LPG News: ఏప్రిల్‌లో పెట్రోల్-డీజిల్ అమ్మకాలు దాదాపు ఫ్లాట్‌.. సిలిండర్ ధర పెరగడంతో తగ్గిన గ్యాస్ వినియోగం

RBI On Coronavirus: కరోనాతో భారీగా ఆర్ధిక నష్టం.. కోలుకోవాలంటే 12 ఏళ్లు పడుతుందంటున్న ఆర్బీఐ

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?