Edible Oil Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. మరింతగా దిగి రానున్న వంట నూనె ధరలు

|

Dec 12, 2021 | 6:20 AM

Edible Oil Prices: ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి..

Edible Oil Prices: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. మరింతగా దిగి రానున్న వంట నూనె ధరలు
Follow us on

Edible Oil Prices: ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి. ఇక ఇటీవల కాలంలో వంట నూనె ధరలు కూడా పెరిగిపోయాయి. స్పందించిన కేంద్రం నూనె ధరలు తగ్గించింది. ఇక తాజాగా మరోసారి సామాన్యులకు ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆయా వంట నూనె ధరలు రూ.7 నుంచి రూ.20 వరకు తగ్గించిన విషయం తెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో వంట నూనె ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాకర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

తాజాగా నూనె గింజలు కిలోకు రూ.3 నుంచి రూ.4 తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నూనెలపై దిగుమతి సుంకాలు తగ్గించడంతో ధరలు మరింతగా తగ్గాయని అసోసియేషన్‌ తెలిపింది. అయితే దేశీయంగా సాగు చేస్తున్న నూనె గింజనలతో వంట నూనె ధరలు మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే నెలలో రేట్లు మరింత తగ్గనున్నాయి. మరోవైపు, నూను గింజల పంట చేతికి వచ్చి కొత్త క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభం కానుండటంతో ఈ ధరలు దిగి రానున్నట్లు తెలుస్తోంది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో నూనె గింజల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు దేశీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపనుంది. గత 30 రోజుల్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు 8-10 శాతం మేర తగ్గడం సంతోషంగా ఉందని సీఈఏ చైర్మన్ అన్నారు. రానున్న నెలలో ధర లీటరుకు రూ.3-4 తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఆవాల విషయానికొస్తే.. ఆవనూనె ధరలు పెరగడం, ఆవాలు ఖరీదైన ధరలకు విక్రయించడంతో ఈసారి పెద్ద ఎత్తున సాగు చేశారు. 77.62 లక్షల హెక్టార్లలో ఆవాలు సాగు చేశారు. ఇది గత ఏడాది కంటే 30 శాతం ఎక్కువ.

దేశంలో ప్రతి సంవత్సరం 22-22.5 మిలియన్ టన్నుల వంటనూనెలు వినియోగిస్తున్నారు. భారత ప్రభుత్వం వినియోగాన్ని తగ్గించేందుకు విదేశాల నుంచి దాదాపు 13-15 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటోంది. మనం గత రెండేళ్లుగా పరిశీలిస్తే, కరోనా మహమ్మారి కారణంగా, దిగుమతులపై భారీ ప్రభావం పడింది.

ఇవి కూడా చదవండి:

PF Withdrawal: మీ పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలా..? ఎన్ని రోజులు పడుతుంది..? పూర్తి వివరాలు..!

Fixed Deposit: ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేటు పెంపు..!