Pension Scheme: ఈ పథకంలో చేరి ప్రతి నెలా రూ.100 డిపాజిట్ చేయండి.. ఆ తర్వాత రూ.3000 పెన్షన్‌ పొందండి

Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM)...

Pension Scheme: ఈ పథకంలో చేరి ప్రతి నెలా రూ.100 డిపాజిట్ చేయండి.. ఆ తర్వాత రూ.3000 పెన్షన్‌ పొందండి
Pension Scheme
Follow us

|

Updated on: Apr 27, 2022 | 11:44 AM

Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM). అసంఘటిత రంగ కార్మికులు కూడా తమ వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాను పొందేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. PM శ్రమ యోగి మాన్ ధన్ యోజన పూర్తిగా స్వచ్ఛందంగా, మీకు ఆర్థికంగా సహకారం అందించే విధంగా ఉంటుంది.ఈ పథకం కింద కార్మికులు కనీసం రూ. 3000 స్థిర పెన్షన్ పొందవచ్చు. ఖాతాదారుడి వయస్సు 60 సంవత్సరాలు నిండినప్పుడు పెన్షన్ పొందవచ్చు. పథకం సమయంలో ఈ పెన్షనర్ మరణిస్తే అతని భార్య లేదా భర్త కుటుంబానికి పెన్షన్‌లో సగం మొత్తాన్ని పొందవచ్చు. కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి అంటే భార్య లేదా భర్తకు మాత్రమే ఇవ్వబడుతుంది.

అసంఘటిత రంగంలోని ఏ కార్మికుడైనా నెలవారీ ఆదాయం రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అతని వయస్సు 18-40 సంవత్సరాలు ఉండాలి. అప్పుడే అతను PM శ్రామిక్ యోగి మాన్ ధన్ యోజనకు అర్హులుగా పరిగణించబడతారు. ఈ పథకం ప్రయోజనం జాతీయ పెన్షన్ సిస్టమ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడు కానీ అదే కార్మికుడు లేదా ఉద్యోగికి వర్తించనుంది. అయితే మాన్ ధన్ యోజన ప్రయోజనం ఆదాయపు పన్ను చెల్లించని ఉద్యోగికి మాత్రమే ఈ స్కీమ్‌ వర్తించనుంది.

మంధన్ పథకం గురించి..

మాన్ ధన్ యోజన డబ్బు ఉద్యోగి బ్యాంక్ ఖాతా లేదా జన్ ధన్ ఖాతా నుండి ఆటో డెబిట్ ద్వారా జమ చేయబడుతుంది. ఉద్యోగి తన ఖాతాను తెరిచినప్పుడు ప్రతి నెలా డిపాజిట్ చేయవలసిన మొత్తం అదే సమయంలో నిర్ణయించబడుతుంది. ఉద్యోగి 60 ఏళ్ల వయస్సు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. 60 ఏళ్ల తర్వాత ఈ డిపాజిట్ ఆధారంగా పెన్షన్ ఇవ్వబడుతుంది.

ఈ పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందినది. అందుకే సగం డబ్బు దాని తరపున జమ చేయబడుతుంది. ఒక వ్యక్తి ప్రతి నెలా మాన్ ధన్ యోజనలో 100 రూపాయలు డిపాజిట్ చేశాడనుకుందాం.. ఆ తర్వాత 100 రూపాయలు కూడా అతని ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధానం 60 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది. లబ్ధిదారుడికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య 50-50 ప్రాతిపదికన డబ్బు జమ చేయబడుతుంది.

మీకు ఎంత పెన్షన్ వస్తుంది?:

ఒక వ్యక్తి 29 సంవత్సరాల వయస్సులో ప్రధానమంత్రి శ్రామిక్ యోగి మంధన్ యోజనలో చేరాడు అనుకుందాం. ప్రతి నెలా రూ.100 జమ చేయగా కేంద్రం ద్వారా రూ.100 జమచేస్తుంది. 29 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అంటే 31 ఏళ్ల వరకు లబ్ధిదారుడు, ప్రభుత్వం ఖాతాలో రూ.100-100 జమ చేస్తుంది. 60 ఏళ్లు పూర్తయిన తర్వాత లబ్ధిదారునికి ప్రతి నెలా రూ.3000 పింఛను అందజేస్తారు. పథకం వ్యవధిలో లబ్ధిదారుడు మరణిస్తే, అతని భార్య పెన్షన్ డబ్బులో సగం కుటుంబ పెన్షన్‌గా పొందడం కొనసాగుతుంది.

1.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న కార్మికులు, చిన్న వ్యాపారులు, దుకాణదారులు,చిన్న వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు ప్రతి నెలా రూ.55, 29 ఏళ్లు నిండిన వారు రూ.100 డిపాజిట్ చేస్తారు. ఈ పథకం ప్రకారం.. 40 ఏళ్లు నిండిన వ్యక్తులు ప్రతి నెలా రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మీ సమీపంలోని జన్ సేవా కేంద్రానికి లేదా డిజిటల్ సేవా కేంద్రానికి వెళ్లవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ అవసరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bank Fixed Deposit: ఈ ఐదు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? వడ్డీ రేట్లు చెక్‌ చేసుకోండి!

Atal Pension Yojana: ఆన్‌లైన్‌లో అటల్‌ పెన్షన్‌ యోజన ఖాతా తెరవాలనుకుంటున్నారా..? ఇంట్లోనే ఉండి ఇలా చేయండి!

SBI Alert: ఈ రెండు నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ లిఫ్ట్ చేశారో అంతే సంగతులు.. ఎస్బీఐ హెచ్చరిక!

PM Kisan: పీఎం కిసాన్‌ స్కీమ్‌లో కేంద్రం కీలక నిర్ణయం.. నిబంధనలు కఠినతరం.. రైతులు ఇలా చేస్తే డబ్బులు అందవు