Post Office: కేవలం వడ్డీతోనే రూ.2 లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..

ఈ మధ్య కాలంలో చాలా మంది పోస్ట్ ఆఫీస్ పథకాల వైపు చూస్తున్నారు. ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్‌లో అద్భతమైన స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మంచి వడ్డీ రేట్లు, సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

Post Office: కేవలం వడ్డీతోనే రూ.2 లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
Post Office Time Deposit Scheme

Updated on: Dec 06, 2025 | 3:21 PM

మంచి ఆదాయంతో పాటు సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం వడ్డీతోనే లక్షలు సంపాదించవచ్చు. ప్రభుత్వ హామీ ఉండడంతో ఈ పథకంలో ఎటువంటి రిస్క్ ఉండదు. పెట్టుబడిదారులకు తమ డబ్బు పోతుందనే భయం అవసరం లేదు. పైగా పన్ను ప్రయోజనాలను కూడా లభిస్తాయి.

పెట్టుబడిపై వడ్డీ రేట్లు

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడిదారులు వేర్వేరు కాలవ్యవధికి వేర్వేరు వడ్డీ రేట్లను పొందుతారు. ఒక సంవత్సరం పెట్టుబడికి 6.9శాతం, రెండు సంవత్సరాల పెట్టుబడికి 7శాతం, మూడు సంవత్సరాల పెట్టుబడికి 7.1శాతం, ఐదు సంవత్సరాల పెట్టుబడికి 7.5శాతం వడ్డీ లభిస్తుంది. దీని అర్థం మీరు మీ అవసరాలు కాలపరిమితి ప్రకారం పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆదాయాలను పెంచుకోవచ్చు. వడ్డీ ఏటా జమ అవుతుంది.

పెట్టుబడి ఉదాహరణ – మెచ్యూరిటీ మొత్తం

ఉదాహరణకు మీరు 5 సంవత్సరాల కాలవ్యవధికి రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 7.5శాతం రేటుతో మీరు 5 సంవత్సరాలలో రూ.2,24,974 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. దీని అర్థం ఎటువంటి శ్రమ లేకుండానే కేవలం వడ్డీ నుండి లక్షల రూపాయలు సంపాదించడం సాధ్యమవుతుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.1,000 గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

ఇవి కూడా చదవండి

పన్ను ప్రయోజనాలు – ఖాతా విధానం

ఈ పథకంలో ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. దీని అర్థం మీరు వడ్డీని పొందడమే కాకుండా మీ పెట్టుబడిపై పన్ను ఆదా ప్రయోజనం కూడా పొందుతారు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కింద సింగిల్ లేదా జాయింట్ ఖాతాలను తెరవవచ్చు. కుటుంబ సభ్యులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఖాతాలను తెరవవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి