Post Office Special Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు..!

|

Nov 19, 2024 | 2:52 PM

Post Office Special Scheme: ప్రజల్లో డబ్బుల పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ తీసుకొచ్చింది. వీటిల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో దాదాపు అన్ని వర్గాల వారి కోసం పథకాలు అందుబాటులో ఉన్నాయి..

Post Office Special Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు..!
Follow us on

ప్రజల్లో డబ్బుల పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ తీసుకొచ్చింది. వీటిల్లో చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో దాదాపు అన్ని వర్గాల వారి కోసం పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆదా చేస్తారు. అలాగే వారు బలమైన రాబడిని పొందడమే కాకుండా తమ డబ్బును సురక్షితంగా ఉంచుకునే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అటువంటి పోస్ట్ ఆఫీస్ పథకం కిసాన్ వికాస్ పత్ర (KVP). దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం 115 నెలల్లో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేస్తుంది. ఈ ప్రత్యేక పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

డబ్బు రెట్టింపు పథకం

మీరు కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే, పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) వంటి ఈ ప్రసిద్ధ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ లాభం పొందేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, డబ్బు 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. 100 గుణిజాల్లో కనీసం రూ.1000 ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో గరిష్ట పరిమితి ఉండకపోవడం విశేషం. మీకు కావలసినంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Chaiwallah Income: ఈ చాయ్‌వాలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు!

పథకంలో ఎన్ని ఖాతాలు తెరవవచ్చు:

కిసాన్ వికాస్ పత్ర పథకం కింద, సింగిల్, డబుల్ ఖాతాలను తెరవవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరు మీద కూడా ఖాతాను తెరవవచ్చు. దీనితో పాటు, ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. దీనికి కూడా పరిమితి లేదు. 2, 4, 6, కిసాన్ వికాస్ పత్ర పథకం కింద మీకు కావలసినన్ని ఖాతాలను తెరవవచ్చు.

7.5 శాతం వడ్డీ:

ఈ పోస్టాఫీసు పథకం కింద వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం ఈ పోస్టాఫీసు పథకం కింద 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ వార్షిక ప్రాతిపదికన జారీ చేస్తారు.

5 లక్షలు పెట్టుబడి పెడితే 10 లక్షల రూపాయలు:

ఎవరైనా ఈ పథకం కింద రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టి, మెచ్యూరిటీ వరకు అంటే 115 నెలల వరకు ఈ పథకంలో ఉంటే అతను 7.5 శాతం వడ్డీ ఆధారంగా వడ్డీ నుండి 5 లక్షల రూపాయలు పొందుతాడు. అంటే ఇన్వెస్టర్లు మెచ్యూరిటీపై రూ.10 లక్షలు పొందుతారు.

ప్రభుత్వం గతంలో కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ వ్యవధిని 123 నెలల నుంచి 120 నెలలకు తగ్గించింది. ఇప్పుడు దాన్ని 115 నెలలకు తగ్గించారు. ఇక ఈ పథకంలో మీరు 115 నెలలు లేదా 9 ఏళ్ల 7 నెలల్లో పెట్టుబడిని డబుల్ చేసుకోవచ్చు. అంటే రూ. లక్ష పెట్టుబడి పెడితే నిర్దిష్ట వడ్డీ ప్రకారం.. అది రూ. 2 లక్షలవుతుంది. అదే రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలుగా మారుతుంది. ఇంకా రూ. 20 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 40 లక్షలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్న పథకం కాబట్టి అసలు ఎలాంటి రిస్క్‌కు అవకాశమే ఉండదు.

ఇది కూడా చదవండి: Fact Check: ఎంఎస్ ధోని పేరిట రూ.7 నాణెం విడుదల అవుతుందా? ఇందులో నిజమెంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి