Post Office: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 20 వేల ఆదాయం
స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు పోస్ట్ ఆఫీస్ అందించే అద్భుతమైన పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో ప్రస్తుతం 8.2శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా సుమారు రూ.20,500 స్థిర ఆదాయం పొందవచ్చు. రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు ఇది సురక్షితమైన మార్గం.

రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందుతున్న సీనియర్ సిటిజన్లకు పోస్ట్ ఆఫీస్ ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. జీతం ఆగిపోయినా, ఖర్చులు అలాగే ఉండే ఈ సమయంలో నెలవారీ స్థిర ఆదాయాన్ని అందించే ఈ పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. రిటైర్‌మెంట్ తర్వాత వచ్చిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఈ పథకం ఒక నమ్మకమైన, సురక్షితమైన మార్గంగా ఉంది.
అధిక వడ్డీ రేటు
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 8.2 శాతం చొప్పున ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది. కేవలం రూ. 1,000 పెట్టుబడితో ఈ పథకంలో ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా రూ. 30 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
రూ. 30 లక్షలు పెడితే ఎంత వస్తుంది?
ఈ పథకంలో అత్యధికంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే.. మీకు మంచి ఆదాయం వస్తుంది.వార్షిక వడ్డీ 8.2శాతం వడ్డీ రేటు ప్రకా..రం సంవత్సరానికి రూ. 2,46,000 లభిస్తుంది.ఈ స్కీమ్ వడ్డీ రేటు త్రైమాసికానికి ఒకసారి అకౌంట్‌లో జమ చేస్తారు. అంటే ప్రతి 3నెలలకు ఒకసారి రూ.61,500 మీకు లభిస్తాయి. దీని ప్రకారం చూస్తే.. సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా సుమారు రూ.20,500 స్థిర ఆదాయం లభిస్తుంది.
మెచ్యూరిటీ – పన్ను మినహాయింపు
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ కాలం తర్వాత దీనిని మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టి, ప్రతి మూడు నెలలకు వడ్డీని ఉపసంహరించుకోకుండా ఉంటే.. 5ఏళ్ల తర్వాత మీ డబ్బు సుమారు రూ. 42 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆర్థిక స్థిరత్వం కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




