AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus 15: పెద్ద బ్యాటరీ.. పవర్‌‌ఫుల్ ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ ఫోన్ లాంచ్! ధర ఎంతంటే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మరొక ఫోన్‌ను రిలీజ్ చేసింది. OnePlus 13 సిరీస్ తర్వాత డైరెక్ట్ గా OnePlus 15ను లాంచ్ చేసింది. ఇందులో పెద్ద బ్యాటరీతోపాటు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే పవర్ ఫుల్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus 15: పెద్ద బ్యాటరీ.. పవర్‌‌ఫుల్ ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ ఫోన్ లాంచ్! ధర ఎంతంటే..
Oneplus 15
Nikhil
|

Updated on: Oct 28, 2025 | 12:01 PM

Share

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తాజాగా OnePlus 15ను లాంచ్ చేసింది. అయితే OnePlus 13 తర్వాత OnePlus 14 ను పక్కనపెట్టి.. నేరుగా OnePlus 15 ను లాంచ్ చేయడం విశేషం. ఈ కొత్త మొబైల్‌లో చాలా అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పవర్‌‌ఫుల్ ప్రాసెసర్,  7,300mAh  సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఫుల్ స్పెసిఫికేషన్లు, ధరల వివరాల్లోకి వెళ్తే..

స్పెసిఫికేషన్లు

OnePlus 15లో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేటును సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్ నెస్1800 నిట్స్ ఉంటుంది.  అలాగే 330Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇందులో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 బేస్డ్ Color OS 16పై రన్ అవుతుంది. ఇందులో16GB వరకు RAM + 1TB వరకు స్టోరేజ్‌ కెపాసిటీ ఉంది. అలాగే ఈ ఫోన్ కొత్త ఐస్ రివర్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

కెమెరా

ఇక OnePlus 15 కెమెరా సెటప్ విషయానికొస్తే ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 3.5x ఆప్టికల్ జూమ్‌ వంటి ఆప్షన్స్ ను సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు మరో  50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ

ఇకపోతే OnePlus 15లో బ్యాటరీని హైలైట్‌గా చెప్పుకోవచ్చు ఇందులో 7,300mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర సుమారు రూ. 60,000 నుండి ప్రారంభమవుతుంది. బ్లాక్, పర్పుల్, శాండ్ డ్యూన్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ అక్టోబర్ 28న చైనాలో సేల్‌కు వస్తుంది. అక్టోబర్ 29న ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి