Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ.50 ఇన్వెస్ట్‌ చేస్తే.. రూ.35 లక్షల బెనిఫిట్‌..!

|

Jul 17, 2022 | 12:40 PM

Post Office Scheme: పోస్టాఫీసుల్లో రకరకాల పొదపు పథకాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు..

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ.50 ఇన్వెస్ట్‌ చేస్తే.. రూ.35 లక్షల బెనిఫిట్‌..!
Post Office Scheme
Follow us on

Post Office Scheme: పోస్టాఫీసుల్లో రకరకాల పొదపు పథకాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పోస్టాఫీసుల్లోనూ ఉన్నాయి. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఇండియ పోస్టల్ శాఖ ప్రభుత్వ మద్దతులో పథకాలను అందిస్తోంది. రిస్క్‌ లేనవి, మంచి రాబడిని అందించే పథకాలున్నాయి. ఇక పోస్ట్‌ ఆఫీస్‌ గ్రామ సురక్ష యోజన పథకం ద్వారా కూడా మంచి ప్రయోజనం పొందవచ్చు.

ఇప్పుడు తన గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష యోజన (Gram Suraksha Yojana) లేదా గ్రామ సురక్ష పథకాన్ని రూపొందించింది. దీని కింద నెలకు రూ.1,500 డిపాజిట్ చేసే పెట్టుబడిదారుడు రూ.35 లక్షల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం.. గ్రామ సురక్ష యోజన 19 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు. గరిష్టంగా 55 ఏళ్లు.

గ్రామ సురక్ష యోజన కనీస విలువ రూ. 10,000 హామీని అందజేస్తుండగా.. పెట్టుబడి పెట్టేవారు రూ. 10 లక్షల వరకు ఏ మొత్తాన్ని అయినా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎవరైనా వ్యక్తి 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చినప్పుడు వారి చట్టపరమైన వారసుడు/నామినీకి మరణం సంభవించినప్పుడు.. ఏది ముందుగా సంభవించినా బోనస్‌తో కూడిన మొత్తం చెల్లించబడుతుంది. ఇందులో నాలుగేళ్ల తర్వాత రుణ సదుపాయం కూడా ఉంటుంది. కస్టమర్ మూడు సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు, అయితే ఐదు సంవత్సరాల కంటే ముందు సరెండర్‌ చేసినట్లయితే ఈ పథకం బోనస్‌కు అర్హత ఉండదు.

ఇవి కూడా చదవండి

పెట్టుబడి.. మెచ్యూరిటీ..

గ్రామ సురక్ష యోజన కింద పాలసీదారుడు ప్రతి నెల కేవలం రూ.50 మొత్తాన్ని డిపాజిట్‌ చేయడం ద్వారా రూ.35 లక్షల వరకు రిటర్న్‌లను పొందవచ్చు. వ్యక్తి ప్రతి నెలా పాలసీ కింద రూ.1,515 పెట్టుబడి పెడితే ( దాదాపు ప్రతి రోజు రూ.50). 58 సంవత్సరాలకు రూ.1,463, 60 సంవత్సరాలకు రూ.1,411. 55 ఏళ్ల బీమా కోసం మెచ్యూరిటీ ప్రయోజనం రూ. 31.60 లక్షలు కాగా, 58 ఏళ్ల పాలసీకి రూ. 33.40 లక్షలు. 60 ఏళ్ల మెచ్యూరిటీ ప్రయోజనం రూ.34.60 లక్షల ప్రయోజనం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి