Post Office Charges: చిన్న పొదుపు పథకాలకు పోస్టాఫీసు ఉత్తమ ఎంపిక. మంచి రాబడితో పాటు పెట్టుబడికి భద్రత ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని కొన్ని పథకాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే వివిధ సేవలపై ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.
సర్వీస్ ఛార్జ్ వివరాలు
1. పోస్టాఫీసులో డూప్లికేట్ పాసుపుస్తకం ఇచ్చేందుకు రూ.50 వసూలు చేస్తారు.
2. మీరు పోస్టాఫీసులో ఖాతా స్టేట్‌మెంట్ లేదా డిపాజిట్ రసీదు పొందాలంటే రూ.20 చెల్లించాలి.
3. పోస్టాఫీసులో పోగొట్టుకున్న లేదా పాడైన సర్టిఫికేట్‌కు బదులుగా పాస్‌బుక్ జారీ చేయడానికి రూ.10 చెల్లించాల్సి ఉంటుంది.
4. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లలో నామినేషన్ మార్చడానికి లేదా రద్దు చేయడానికి రూ.50 ఛార్జీ ఉంటుంది.
5. మీరు పోస్టాఫీసులోని పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టి, ఖాతాను బదిలీ చేయాలనుకుంటే మీరు రూ.100 చెల్లించాలి.
6. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో చెక్ బుక్ జారీ చేయడానికి క్యాలెండర్ సంవత్సరంలో 10 లీవ్‌లకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక్కో చెక్ లీఫ్‌కు రూ.2 చెల్లించాల్సి ఉంటుంది.
7. చెక్ బౌన్స్ అయితే రూ.100 ఫైన్ విధిస్తుంది.
8. ఈ సర్వీస్ ఛార్జీలన్నింటికీ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టాఫీసు పథకాలు
పోస్టాఫీసు పథకాలలో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్ ఖాతా, టైమ్ డిపాజిట్ ఖాతా, నెలవారీ ఆదాయ పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి పథకం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ATM / డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీ రూ.125, GST వసూలు చేస్తుంది. ఈ ఛార్జీలు 1 అక్టోబర్ 2021, 30 సెప్టెంబర్ 2022 కాలానికి వర్తిస్తాయి. ఇండియా పోస్ట్ తన డెబిట్ కార్డ్ కస్టమర్‌లకు పంపిన SMS హెచ్చరికల కోసం రూ.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది.