MIS Scheme: పోస్టాఫీస్‌లో సూపర్ పథకం.. సేఫ్టీతో పాటు, మంచి ఆదాయం..
పోస్టాఫీస్‌లో.. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పేరుతో మంచి పథకాన్ని అందిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రతీ నెల స్థిర ఆదాయాన్ని పొందొచ్చు. డబ్బుకు గ్యారెంటీతో పాటు మంచి ఆదాయం పొందొచ్చు. ఈ పథకాన్ని నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం..

ప్రతీ ఒక్కరూ సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని భావిస్తుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బులపై ఎక్కువ వడ్డీ రాకపోయినా పర్లేదు కానీ డబ్బుకు గ్యారెంటీ ఉంటే చాలనే భావనలోనే చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం పోస్టాఫీస్‌లో ఎన్నో సూపర్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ మంచి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్‌లో.. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పేరుతో మంచి పథకాన్ని అందిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రతీ నెల స్థిర ఆదాయాన్ని పొందొచ్చు. డబ్బుకు గ్యారెంటీతో పాటు మంచి ఆదాయం పొందొచ్చు. ఈ పథకాన్ని నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం పోస్టాఫీస్‌లో మొదట ఖాతా తీసుకోవాల్సి ఉంటుంది.
పోస్టాఫీస్ అందిస్తోన్న మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌లో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ జాయింట్ ఖాతాను తీసుకుంటే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం రిటైర్డ్ ఉద్యోగులతో పాటు, సీనియర్ సిటిజన్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ ఈ ఖాతాను మైనర్ పేరుతో ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో పెట్టుబడికి 7.4 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంలో చేరాలంటే ఏదైనా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, నామినీ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ పథకం కనీస మెచ్చూరిటీ వ్యవధి 5 ఏళ్లుగా ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి ముందే డబ్బులు తీసుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. 3 ఏళ్లలోపు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే 2 శాతం పెనాల్టీ చెల్లించాలి, 3 నుంచి 5 ఏళ్లలోపు విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం నష్టపోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..