Post Office Nominee: పోస్టాఫీసు అకౌంట్.. నామినీ లేకుండా డబ్బు ఎలా పొందాలి..? పూర్తి వివరాలు

|

Jul 17, 2022 | 11:15 AM

Post Office Nominee: పోస్టాఫీసుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వినియోగదారుల కోసం పోస్టల్‌ శాఖ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పోస్టాఫీసులో సేవింగ్స్..

Post Office Nominee: పోస్టాఫీసు అకౌంట్.. నామినీ లేకుండా డబ్బు ఎలా పొందాలి..? పూర్తి వివరాలు
Post Office Nominee
Follow us on

Post Office Nominee: పోస్టాఫీసుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వినియోగదారుల కోసం పోస్టల్‌ శాఖ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాను తెరిచేటప్పుడు కస్టమర్‌లు నామినీ కాలమ్‌ను పూరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కారణంగా ఖాతాదారుడు మరణిస్తే అటువంటి పరిస్థితిలో ఖాతాలో జమ చేసిన డబ్బు నామినీకి ఇవ్వబడుతుంది. అయితే ఫారమ్ నింపేటప్పుడు ప్రజలు నామినీని నింపడం మర్చిపోవడం చాలాసార్లు గమనించినట్లు పోస్టాఫీసు అధికారులు చెబుతున్నారు. తరువాత డబ్బు క్లెయిమ్ చేయడంలో సమస్యలు ఎదుర్కొవచ్చు.

నామినీ లేకపోతే ఏమి చేయాలి?

పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో నామినీ లేకుంటే 5 లక్షల లోపు మొత్తానికి ప్రత్యేక నిబంధన పెట్టారు. దీని ప్రకారం ఎవరైనా ఖాతాలో రూ.5 లక్షల లోపు డిపాజిట్ ఉండి మరణిస్తే ఖాతాదారుని మరణ ధ్రువీకరణ పత్రాన్ని పోస్టాఫీసులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే క్లెయిమ్ ఫారమ్‌ను పూరించాలి. ఆపై అతను నష్టపరిహారం, అఫిడవిట్, KYC పత్రం (ఆధార్ కార్డ్), ఇతర వివరాలతో పాటు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దీని తర్వాత మీ అన్ని పత్రాలు తనిఖీ చేస్తారు అధికారులు. మీ క్లెయిమ్ ఫారమ్ క్రాస్ చెక్ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు క్లెయిమ్ చేస్తారు. ఈ క్లెయిమ్‌ను 6 నెలలలోపు చేయవచ్చు.

5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే ఏం చేయాలి?

మీ ఖాతాలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ జమ అయినట్లయితే, మీరు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం చాలా ముఖ్యం. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఖాతాదారునికి నిజమైన వారసుడని నిరూపించుకోవాలి. దీని తర్వాత మీరు పైన పేర్కొన్న మిగిలిన పత్రాలను కూడా సమర్పించాలి. ఖాతాలో జమ చేసిన డబ్బుకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి