National Savings Certificates: పోస్టల్ శాఖ వినియోగదారుల కోసం రోజురోజుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. పోస్టాఫీసులు అన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా అధిక లాభాలు పొందే స్కీమ్‌లను తీసుకువస్తోంది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని వారికి మరింత ప్రయోజనం చేకూరేలా పథకాలను ప్రవేశపెడుతూ ప్రస్తుతం పోస్టల్ శాఖ దూసుకుపోతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పోస్టల్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కొన్ని సార్లు ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో పోస్టల్ బీమా పాలసీల పట్ల ప్రజలకు మక్కువ పెరిగింది. ఇక తాజాగా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం అందుబాటులో ఉంది.
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. లేకపోతే కనీసం 100 నుంచి 1000 వరకు జమచేసుకోవచ్చు. ఈ పథకం కాలవ్యవధి 5 సంవత్సరాలు. ఈ పథకంపై పోస్టల్ శాఖ 6.8 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీని వార్షిక ప్రాతిపదికన లెక్కించి.. మెచ్యూరిటీపై వడ్డీని చెల్లిస్తారు. పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. దీనిలో కనీసం లక్ష వరకు పెట్టుబడి పెడితే మంచి లాభం పొందవచ్చని చెబుతోంది పోస్టల్ శాఖ. అలాగే ఒక వ్యక్తి ఈ స్కీమ్‌లో ఎన్ని ఖాతాలైన తీసే సదుపాయం ఉంది. ఈ స్కీమ్‌లో రుణ సదుపాయం కూడా ఉంది. ఖాతా తెరిచిన తర్వాత సాధారణ సమయంలో ప్రీ -మెచ్యూర్ క్లోజర్ సాధ్యం కాదు.
పన్ను ప్రయోజనాల విషయంలో.. 80సి కింద పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడిపై వచ్చే వడ్డీపై కూడా పన్ను విధించబడుతుంది. ఖాతాదారుడు ప్రతి సంవత్సరం రిటర్న్‌లో తన వడ్డీ ఆదాయాన్ని తెలుపాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సంవత్సరంలో కూడా, మునుపటి సంవత్సరం వడ్డీ ఆదాయంపై కూడా పన్ను విధిస్తారు. అయితే ఈ పథకం కింద ప్రతి సంవత్సరం సంపాదించిన వడ్డీ ఆదాయం తిరిగి పెట్టుబడి అవుతుంది. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీపై వడ్డీ ఆదాయంపై ప్రయోజనం లభిస్తుంది.
ప్రతీ మూడు నెలలకొకసారి వడ్డీ రేటుపై ప్రభుత్వం సమీక్షిస్తుంది. పెట్టుబడిదారులు వార్షిక ప్రాతిపదికన మొత్తం పెట్టుబడిపై వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. దీని కింద మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత మీ మొత్తం 1389.49 రూపాయలు అవుతుంది. అంటే వడ్డీ ఆదాయం రూ .389.49. ఈ విధంగా 10వేలు పెట్టుబడి పెడితే.. వడ్డీ ద్వారా ఆదాయం 3, 890 రూపాయలు వస్తుంది. ఇలా లక్ష పెట్టుబడికి వడ్డీకి 38,949 రూపాయల వడ్డీ వస్తుంది. ఈ పథకం పోస్టాఫీసులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 18 ఏళ్లపైన వారు.. లేదా మైనర్లు ఉంటే.. ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతా (Post Office Saving Scheme)ను తెరవచ్చు. ఐదేళ్ల వరకు ఈ పథకాన్ని నిలుపుదల చేయరు. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసులో సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. అదే విధంగా ఎన్‌ఎస్‌సీ వివరాల ప్రకారం.. లక్ష రూపాయల పెట్టుబడికి ఐదు సంవత్సరాల తర్వాత రూ.138949 రూపాయలు పొందవచ్చు. అలాగే 2 లక్షల పెట్టుబడిపై రూ.277899, రూ. 5 లక్షల పెట్టుబడిపై 694746 వరకు పొందవచ్చు.
నెల ముందు నుంచే ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం..!
గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ