Poco M3 Pro: పోకో నుంచి విడుదల కానున్న 5జీ మొబైల్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!

|

Jun 02, 2021 | 12:25 PM

Poco M3 Pro: పోకో మనదేశంలో మొట్టమొదటి 5జీ ఫోన్ విడుదల చేయనుంది. పోకో ఎం3 ప్రో 5జీ పేరుతో మొబైల్‌ లాంచ్‌ కానుంది. అయితే ఈ ఫోన్ మనదేశంలో జూన్ 8వ తేదీన..

Poco M3 Pro: పోకో నుంచి విడుదల కానున్న 5జీ మొబైల్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!
Poco M3 Pro
Follow us on

Poco M3 Pro: పోకో మనదేశంలో మొట్టమొదటి 5జీ ఫోన్ విడుదల చేయనుంది. పోకో ఎం3 ప్రో 5జీ పేరుతో మొబైల్‌ లాంచ్‌ కానుంది. అయితే ఈ ఫోన్ మనదేశంలో జూన్ 8వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ ఇటీవలే జరిగింది. చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ నోట్ 10 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ విడుదలైంది.

పోకో ఎం3 ప్రో 5జీ ధర(అంచనా)

ఈ ఫోన్ ఇప్పటికే యూరోప్‌లో విడుదలైంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 179 యూరోలుగా(సుమారు రూ.16,000) ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 199 యూరోలుగా(సుమారు రూ.17,700) నిర్ణయించారు. అయితే చైనాలో ఈ ఫోన్ ధర 999 యువాన్లుగా(సుమారు రూ.11,400) ఉంది. మనదేశంలో రూ.15 వేలలోపు ధరలోనే ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రియల్ మీ నార్జో 30 ప్రో 5జీ, రియల్ మీ 8 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.

పోకో ఎం3 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు

అందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్జ్‌ గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్‌ అవుతుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో పొందుపర్చారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

ఇవీ కూడా చదవండి:

Post Office: పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి రూ.16 లక్షలు

SBI Insurance: గుడ్‌న్యూస్‌ .. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల వరకు లైఫ్‌ కవరేజీతో ..

State Bank of India: వినియోగదారులను మరోసారి హెచ్చరించిన ఎస్‌బీఐ.. జూన్‌ 30 వరకు గడువు విధింపు

LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర