Loan: ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 3 లక్షల లోన్‌.. కేంద్ర ప్రభుత్వం సదవకాశం

కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులకు ఎలాంటి హామీ లేకుండా రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నాయి. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తున్నారు. గతేడాది విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రుణ సౌకర్యంతో పాటు...

Loan: ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 3 లక్షల లోన్‌.. కేంద్ర ప్రభుత్వం సదవకాశం
Loan
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 14, 2024 | 6:12 PM

సాధారణంగా ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే బ్యాంకులు రుణ గ్రహీతల నుంచి ఏదైనా గ్యారెంటీ అడుగుతాయి. రుణం పొందడానికి ఆదాయా మార్గాలను, రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి రుణాన్ని చెల్లిస్తాడా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణం సౌకర్యం అందిస్తోంది. విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా ఈ రుణాన్ని అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులకు ఎలాంటి హామీ లేకుండా రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నాయి. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తున్నారు. గతేడాది విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో రుణ సౌకర్యంతో పాటు, నైపుణ్య శిక్షణ కూడా అందిస్తారు. పలు వర్గాలకు చెందిన వారికి ఈ రుణాన్ని అందించనున్నారు. వడ్రంగి, కమ్మరి, గోల్డ్, పడవ బిల్డర్లు, టూల్ కిట్ తయారీదారు, స్టోన్ బ్రేకర్స్, చెప్పులు కుట్టేవారు, చాప/ చీపురు తయారీదారులు, కుండలు, బొమ్మలు తయారీ దారు, దర్జీ పనిచేసే వారు ఈ రుణాన్ని పొందొచ్చు.

ఈ పథకం ప్రయోజనం పొందాలనుకునే వారు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇక దరఖాస్తుదారుడు పథకంలో చేర్చిన 140 కులాలలో ఏదైనా ఒక కులానికి చెందినవారై ఉండాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నంబర్, అడ్రస్‌ ప్రూఫ్‌, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరపడతాయి.

ఇక ఈ పథకం దరఖాస్తు చేసుకునే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmvishwakarma.gov.in లోకి వెళ్లాలి. అంతనంర పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన కోసం దరఖాస్తు ఆన్‌లైన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన కోసం నమోదు చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలు వెళ్తాయి. చివరిగా ఫామ్‌ను పూర్తి చేసి అవసరామైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..