AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Watch: ప్రధాని మోదీ ధరించిన వాచ్‌ను చూశారా? ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

Modi Watch: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమన్ బాగ్ వాచ్ ధరించి కనిపించారు. ఇది కేవలం ఒక వాచ్ మాత్రమే కాకుండా.. భారతీయ కళాత్మకత, వారసత్వం, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రోమన్ బాగ్ వాచ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది..

Modi Watch: ప్రధాని మోదీ ధరించిన వాచ్‌ను చూశారా? ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
Subhash Goud
|

Updated on: Nov 18, 2025 | 10:38 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. జైపూర్ వాచ్ కంపెనీ తయారు చేసిన ఈ టైమ్‌పీస్ పేరు ‘రోమన్ బాగ్’.

అయితే ఇది కేవలం ఒక వాచ్ మాత్రమే కాకుండా.. భారతీయ కళాత్మకత, వారసత్వం, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రోమన్ బాగ్ వాచ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని డయల్. ఈ వాచ్‌ మధ్యలో 1947 నాటి అసలు ఒక రూపాయి నాణెం ఉంటుంది. ఈ నాణెంపై భారతదేశపు ప్రత్యేక చిహ్నం అయిన నడుస్తున్న పులి బొమ్మ కూడా ముద్రించబడి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: GST Notice: రోజు వారీ కూలీకి షాకిచ్చిన జీఎస్టీ శాఖ.. రూ.35 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసు.. అసలు ఏం జరిగింది?

ఈ వాచ్‌ మధ్యలో ఉన్న నాణెంపై ఉన్న 1947 సంవత్సరం భారతదేశం స్వాతంత్ర్యం పొందిన సంవత్సరాన్ని సూచిస్తుంది. ఇది భారతదేశం తనదైన గుర్తింపును పెంచుకుంటూ.. స్వయం సమృద్ధి దిశగా వేసిన శక్తివంతమైన అడుగుకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ డిజైన్.. ప్రధాని మోదీ బలంగా సమర్థించే మేక్ ఇన్ ఇండియా నినాదానికి బలమైన మద్దతుగా కనిపిస్తుంది.

ధర ఎంతో తెలుసా?

ఈ రోమన్ బాగ్ వాచ్ ‌ను మన్నికైన 316ఎల్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన 43 మిల్లీమీటర్ల కేస్‌ను కలిగి ఉంది. అలాగే దీనికి ఎలాంటి గీతలు పడకుండా ఉండేందుకు ముందు, వెనుక భాగాల్లో నీలమణి క్రిస్టల్స్‌ను ఉపయోగించింది కంపెనీ. ఈ వాచ్‌ ధర సుమారుగా రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య ఉంటుందని అంచనా.

ఇది కూడా చదవండి: SBI నుండి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకోవడానికి మీ జీతం ఎంత ఉండాలి. EMI ఎంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి