PM Modi Schemes: ప్రజలకు ప్రయోజనాలు కల్పిస్తున్న మోడీ పథకాలు.. ఆర్థికంగా ఆసరా..!

|

Sep 17, 2022 | 8:00 AM

PM Modi Schemes: ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్యులకు ఎన్నో ప్రజనాలు కల్పిస్తున్నారు. నిరుపేదలకే కాకుండా రైతులకు కూడా ఆర్థికంగా..

PM Modi Schemes: ప్రజలకు ప్రయోజనాలు కల్పిస్తున్న మోడీ పథకాలు.. ఆర్థికంగా ఆసరా..!
Pm Modi
Follow us on

PM Modi Schemes: ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్యులకు ఎన్నో ప్రజనాలు కల్పిస్తున్నారు. నిరుపేదలకే కాకుండా రైతులకు కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అలాగే ఆరోగ్య బీమా పథకాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలకు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వారికి ఆరోగ్యం విషయంలో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య బీమా పాలసీను ప్రవేశపెడుతోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం వచ్చేలా రూపొందిస్తోంది. అలాగే పెన్షన్‌ పథకం లాంటివి కూడా ప్రవేశపెడుతోంది కేంద్రం. ఈ పథకాల వల్ల ప్రజలు ఎన్నో ప్రయోజనాలు అందుకోవచ్చు. సెప్టెంబర్‌ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ఉండగా, కొన్ని పథకాల గురించి ప్రస్తావిస్తున్నాము.

  1. ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌ యోజన (Pradhanmantri Jan Dhan Yojana): ఈ స్కీమ్‌ కింద బ్యాంకు ఖాతా తెరిచిన వారికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఖాతాదారులు రూపే డెబిట్‌ కార్డు కూడా పొందవచ్చు. ఖాతాదారులు రూపే కార్డుతో రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ10,000 వరకు ఓవర్‌ డ్రాప్ట్‌ సౌకర్యం పొందవచ్చు. వీరు వివిధ పథకాలకు అర్హులు.
  2. ఆరోగ్య బీమా (Arogya Bima): ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఆరోగ్య బీమాలు చేసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. మీరు ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్‌ భారత్‌ నుంచి ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. గతంలో రూ.30 వార్షిక ప్రీమియంతో కుటుంబానికి రూ.5 లక్షల వరకు కవరేజీని అందుకోవచ్చు. ప్రధానంగా దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
  3. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana): ఈ స్కీమ్‌ తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. 18-70 సంవత్సరాలు గల వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పథకంలో రూ.2 లక్షలు ప్రమాదవశౄత్తు మరణం, పూర్తి వైక్యలం వంటి కవరేజీని అందుకోవచ్చు. జూన్‌ 1 నుంచి మే 31 మధ్య ఈ స్కీమ్‌లో చేరాలి. ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం ఖాతాదారుని బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతాయి. ఈ పథకాన్ని ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు, సారూప్య నిబంధనలపై అందించే ఇతర సాధారణ బీమా సంస్థలు అందిస్తున్నాయి.
  4. జీవన్‌ జ్యోతి బీమా యోజన (Jeevan jyoti bima Yojana): ఈ పథకంలో చేరేందుకు 18-50 సంవత్సరాలున్నవారు చేరవచ్చు. ఈ స్కీమ్‌ ద్వారా రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ ఉంటుంది. వార్షిక ప్రీమియం రూ.436. ప్రతి ఏడాది బ్యాంకు ఖాతా నుంచి ఆటోడెబిట్‌ అవుతాయి. ఈ పథకాన్ని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. అటల్‌ పెన్షన్‌ యోజన స్కీమ్‌ (Atal Pension Yojana): ఈ పథకంలో 60 సంవత్సరాల తర్వాత పెన్షన్‌ను అందుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరేందుకు 18-40 సంవత్సరాలున్నవారు సేవింగ్‌, పోస్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలు తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి రూ.1000 నుంచి రూ.5000 వరకు నెల వారీ పెన్షన్‌ అందుకోవచ్చు. అయితే ఈ పథకంలో చేరిన వారికి వయసును బట్టి ప్రీమియం ఉంటుంది.
  7. సుకన్య సమృద్ధి ఖాతా (Sukanya Samriddhi Accounts): సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో కూడా ఓపెన్‌ చేయవచ్చు. దీనిలో మీరు మీ అమ్మాయి కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున రాబడిని సృష్టించవచ్చు. ఈ స్కీమ్‌లో 7.6% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ చాలా బ్యాంకుల వడ్డీ రేట్ల కంటే ఎక్కువ. మీరు 90 రోజుల నుండి 10 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చు. ఇందులో మీరు ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. ఆడపిల్లకు 21 ఏళ్లు నిండిన తర్వాత మీరు మొత్తాన్ని ఖాతా నుండి తీసుకోవచ్చు.
  8. కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ (PM Kisan Samman Nidhi Yojana: ఈ పథకం రైతులకు వర్తిస్తుంది. ఇందులో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.6000 చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. ఏడాదిలో మూడు విడతలుగా రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి