PM Kisan: పీఎం కిసాన్‌ పథకంలో భార్యాభర్తలిద్దరికి డబ్బులు వస్తాయా..! అసలు నిజాలు తెలుసుకోండి..

|

Nov 03, 2021 | 4:53 PM

PM Kisan: మీరు PM కిసాన్ పథకం లబ్ధిదారులైతే ఇది మీకు శుభవార్త అని చెప్పవచ్చు. చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్

PM Kisan: పీఎం కిసాన్‌ పథకంలో భార్యాభర్తలిద్దరికి డబ్బులు వస్తాయా..! అసలు నిజాలు తెలుసుకోండి..
Pm Kisan
Follow us on

PM Kisan: మీరు PM కిసాన్ పథకం లబ్ధిదారులైతే ఇది మీకు శుభవార్త అని చెప్పవచ్చు. చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రతి 4 నెలలకు రూ.2000 రైతు ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 విడతలుగా రైతు ఖాతాకు డబ్బులు చేరగా త్వరలో 10వ విడత రైతు ఖాతాలో జమ కానుంది.

అయితే ఈ పథకం గురించి ఒక అపోహ ఉంది. భార్యాభర్తలు ఇద్దరు అప్లై చేసుకుంటే ఒక్కరికే డబ్బులు వస్తాయని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ స్కీం కింద భార్యాభర్తలిద్దరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇద్దరు ఈ పథకానికి అర్హులై ఉండాలి. అంటే ఇద్దరి పేరుపై సాగుభూమి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద రెండు హెక్టార్లు లేదా 5 ఎకరాల సాగు భూమి ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.

ఇప్పుడు ప్రభుత్వం హోల్డింగ్ పరిమితిని ఎత్తివేసింది. సాగు భూమి ఎవరి పేరుతో ఉందో వారికి డబ్బులు జమవుతాయి. కానీ ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేస్తే అతను అ పథకానికి అర్హుడు కాదు. అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి చాలామంది బోగస్‌ రైతులు ఈ పథకం ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. ఈ అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాలను మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రధానమంత్రి రైతు సన్మాన పథకం ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులను తప్పనిసరి చేసింది.

దీని ప్రకారం, లబ్ధిదారుల కుటుంబాలు తమ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ మరియు PM-KISAN వెబ్‌సైట్‌లో డిక్లరేషన్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంది. ఇప్పుడు పదో విడత 2021 డిసెంబర్ 15 నాటికి రైతుల బ్యాంకు ఖాతాకు రూ.2000 చేరుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై మోదీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీన్ని పొందడానికి మీరు PM కిసాన్ సమ్మాన్‌ నిధి కింద నమోదై ఉండాలని గుర్తుంచుకోండి.

Diwali 2021: బాణాసంచా ఉత్పత్తిలో రెండో స్థానంలో భారత్.. అత్యధికంగా ఈ నగరంలోనే తయారు చేస్తారు..

IND vs AFG: సిక్సర్లు బాదుతున్న టీమిండియా ఫినిషర్.. కానీ మ్యాచ్‌లో రాణిస్తాడో లేదో తెలియడం లేదు..

Akhilesh Yadav: పాక్ ఐఎస్ఐ నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం.. యూపీ మంత్రి సంచలన ఆరోపణలు