AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.6 వేలు.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్కోండి..

అన్నదాతలకు ఆర్ధికంగా సాయం అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ పథకం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేల సాయం అందిస్తోంది. వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకానికి అర్హతలు ఏంటి? ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా అనేది చూద్దాం.

Central Government: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.6 వేలు.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్కోండి..
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Oct 26, 2026 | 8:22 AM

Share

దేశంలోని చిన్న, సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ నగదును రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి వీటిని విడుదల చేస్తోంది. ఎప్పటినుంచో ఈ పథకం అమలవుతోంది. ఇప్పటివరకు 23 విడతల సొమ్ము అందించగా.. అక్టోబర్ 30వ తేదీన 24వ విడత నగదును గుజరాత్‌ వేదికగా ప్రధాని మోదీ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో అసలు పీఎం కిసాన్ అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్ అర్హతలు ఏంటి..?

-భారతీయ పౌరులు అయి ఉండాలి

-ఐదు ఎకరాల్లోపు పోలం కలిగి ఉండాలి. 5 ఎకరాలుపైబడి ఉంటే ఈ పథకం వర్తించదు

-ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు

-రేషన్ కార్డు కలిగి ఉండాలి

-ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు

-కుటుంబంలో ఇద్దరి పేర్లపై పోలం ఉంటే ఒకరికి మాత్రమే లబ్ది చేకూరుతుంది. ఇద్దరికీ వర్తించదు

ఏయే పత్రాలు అవసరం..

ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, పట్టాదారు పాస్ బుక్ వంటి పత్రాలు అవసరం

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించండి

-హోమ్ పేజీలో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి

-మీ ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలు ఎంచుకోవాలి

-పేరు, లింగం, కేటగిరీ, బ్యాంక్ వివరాలు, పట్టాదారు పాస్ బుక్ వివరాలు అందించాలి

-భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంక్ పాస్ బుక్ వివరాలు అప్‌లోడ్ చేయాలి

-అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి

-పీఎం కిసాన్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?

-పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేయండి

-ఫార్మర్స్ కార్నర్ సెక్షన్‌లోకి వెళ్లండి

-నో యువర్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి

-రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి

-మీ రిజిస్డర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి

-స్క్రీన్‌పై మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

Follow Us