PM Kisan: ఈ పని చేయకుంటే అకౌంట్లో రూ.2000 రావు.. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ఇంటి నుంచే..

PM Kisan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. రైతులకు ఏడాదికి 6000 రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తోంది. అయితే రైతులు ఈ ఒక్క పని చేయకుంటే వచ్చే 22వ విడత అందదని గుర్తించుకోండి. అయితే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లోనే ఈ పని చేయవచ్చు..

PM Kisan: ఈ పని చేయకుంటే అకౌంట్లో రూ.2000 రావు.. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు ఇంటి నుంచే..
Pm Kisan Samman Nidhi Scheme

Updated on: Jan 09, 2026 | 3:10 PM

PM Kisan Scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 22వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. PM కిసాన్ తదుపరి విడత తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గత నమూనాల ఆధారంగా 22వ విడత ఫిబ్రవరి 2026లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే KYC పూర్తయిన రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ నిధులు అందుతాయి. ఈ తప్పనిసరి ప్రక్రియను పూర్తి చేయని రైతులకు వారి వాయిదాలు నిలిచిపోనుంది. మీరు ఇంటి నుండే పీఎం కిసాన్ e-KYCని కూడా పూర్తి చేయవచ్చు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్) అనేది వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మొత్తం రూ.6,000 వార్షిక సహాయాన్ని పొందుతారు. ఇది రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో పంపిణీ అవుతుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మోసం జరిగే అవకాశాలు ఉండవు.

ఇది కూడా చదవండి: Personal Loan Mistakes: పొరపాటున కూడా ఈ 3 విషయాల కోసం వ్యక్తిగత రుణం తీసుకోకండి.. అప్పుల ఊబిలో చిక్కుకుంటారు!

OTP ఉపయోగించి ఇంటి నుండే PM కిసాన్ e-KYC ఎలా చేయాలి?

ఓటీపీ ఆధారిత e-KYCని నిర్వహించడానికి రైతులు వారి ఆధార్‌తో లింక్ చేయబడిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.

  • pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • ఫార్మర్స్ కార్నర్‌కి వెళ్లి “eKYC” పై క్లిక్ చేయండి.
  • మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సెర్చ్‌ చేయండి.
  • ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి Get OTPపై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసి సమర్పించండి.
  • eKYC విజయవంతం అయిన వెంటనే స్థితి అప్‌డేట్‌ అవుతుంది.

పీఎం కిసాన్‌ జాబితాలో పేరు ఉందో లేదో ఎలా తనిఖీ చేయాలి?

ముందుగా https://pmkisan.gov.in/homenew.aspx వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ మీరు రైతు కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితా ఎంపికను కనుగొంటారు.
మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఆపై మీ జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి. ఆపై నివేదిక పొందండిపై క్లిక్ చేయండి. పూర్తి జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి