Nirmala Sitharaman: పీఎల్‌ఐ పథకం పెట్టుబడులను ఆకర్షిస్తుంది.. తయారీ, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది..
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం పెట్టుబడులను ఆకర్షించడానికి సాహాయపడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు...
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం పెట్టుబడులను ఆకర్షించడానికి సాహాయపడిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. దేశంలో తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడిందని చెప్పారు. 1.97 లక్షల కోట్ల వ్యయ ప్రతిపాదనతో 2021-22 బడ్జెట్‌లో PLI పథకాన్ని ప్రకటించారు. ఇది టెక్స్‌టైల్స్, స్టీల్, టెలికమ్యూనికేషన్స్, వాహనాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి 13 ప్రధాన రంగాలను కవర్ చేస్తుంది.
“ఈ పథకం ఫలితాలు చాలా సానుకూలంగా ఉన్నాయి, PLI పథకాలు కీలకమైన ప్రాంతాల కోసం రూపొందించాం. ఇందులో భాగంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. దీంతో ఆయా రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అదే సమయంలో ఇది దేశీయ మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి, మిగులును ప్రపంచ మార్కెట్‌కు పంపడానికి సహాయపడుతుంది. ఇది తయారీ, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది.” ఆమె పేర్కొన్నారు.
PLI పథకం అంటే ఏమిటి
PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ పథకం కింద, దేశంలో ఉత్పత్తిని పెంచే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఈ పథకం కింద దేశంలో ఉత్పత్తిని పెంచేందుకు విదేశీ కంపెనీలే కాకుండా దేశీయ కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఉత్పత్తిని పెంచడానికి కంపెనీలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తయారీని పెంచడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని పెంచే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది ప్రభుత్వం.