AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మారనున్న భారత కరెన్సీ నోట్లు.. పేపర్ స్థానంలో కొత్త రకం నోట్లు.. ఆర్బీఐ సంచలన ప్రకటన..!

ప్రస్తుతం మనం పేపర్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటి స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్న రోజుల్లో చూడవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ కసరత్తులు చేస్తోంది. దీనిపై ఆర్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది.

RBI: మారనున్న భారత కరెన్సీ నోట్లు.. పేపర్ స్థానంలో కొత్త రకం నోట్లు.. ఆర్బీఐ సంచలన ప్రకటన..!
Rbi
Venkatrao Lella
|

Updated on: Jun 05, 2026 | 7:10 PM

Share

ప్రస్తుతం పేపర్ కరెన్సీ నోట్లు ఉండగా.. వీటి వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేపర్ నోట్లు త్వరగా పాడైపోవడంతో పాటు చిరిగిపోయే అవకాశముంటుంది. దీంతో పాటు వీటి తయారీకి ఎక్కువ ఖర్చవుతుంది. దీంతో వీటి స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్‌తో తయారుచేసిన కరెన్సీ నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రవేశపెట్టనుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ ప్రతిపాదనలు సిద్దం చేసిందని, వివిధ వర్గాల అభిప్రాయం అనంతరం త్వరలో అందుబాటులోకి తీసుకురానుందనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి.

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ..!

ఈ వార్తలపై ఎట్టకేలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను తీసుకొచ్చే అంశం ప్రతిపాదనల దశలో ఉందని, ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రాధమిక దశలో ఉందని తెలిపారు. శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పలు కీలక ప్రకటనలు చేశారు. రెపో రేటును 5.25 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. గత ఏడాది రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు తగ్గించగా.. ఈ ఏడాదిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీని వల్ల రుణ, ఈఎంఐ వడ్డీ రేట్లు యథాతధంగా ఉండనున్నాయి.

ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల వల్ల ఉపయోగం

ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్లు త్వరగా మురికి పడతాయి. అలాగే వెంటనే చిరిగిపోతాయి. దీంతో పాటు నకిలీ నోట్ల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. వీటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని గతంలోనే ప్రతిపాదనలు సిద్దం చేసింద. కానీ అది కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఆ నిర్ణయంపై సమాలోచనలు చేస్తోంది. ప్లాస్టిక్ నోట్లు గట్టిగా ఉండటం త్వరగా చిరిగిపోవు. అలాగే మురికిగా మారే అవకాశాలు తక్కువా ఉంటాయి. ఇవి ఎక్కువకాలం అలాగే ఉంటాయి. డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కరెన్సీ నోట్లకు డిమాండ్ ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కరెన్సీని ఎక్కువగా వాడుతున్నారు. ఇక నగరాల్లో కూడా జేబుల్లో క కరెన్సీ నోట్లను ఉంచుకునేవారు కూడా ఉన్నారు. దీంతో డిటిటల్ లావాదేవీల కాలంలో కూడా నోట్లను ఉపయోగించేవారు కూడా చాలామంది ఉన్నారు. దీంతో పాలిప్రొఫైలిన్ అనే ప్రత్యేక ప్లాస్టిక్‌ పాలిమర్‌తో తయారుచేసిన నోట్లను తీసుకురావాలని ఆర్బీఐ చూస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను మనం చూడవచ్చు. పేపర్ నోట్లను తొలగించి వీటిని తెచ్చే అవకాశముంటుంది.

Follow Us