AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Vehicle Loan: ఎలక్ట్రిక్ వాహనం కొనాలని అనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఎస్బీఐ నుంచి తక్కువ వడ్డీతో లోన్స్!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు గ్రీన్ కార్ లోన్ పథకాన్ని తీసుకొచ్చింది.

Electric Vehicle Loan: ఎలక్ట్రిక్ వాహనం కొనాలని అనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఎస్బీఐ నుంచి తక్కువ వడ్డీతో లోన్స్!
Sbi Electric Vehicle Loan Interest Rates
KVD Varma
|

Updated on: Jun 08, 2022 | 5:28 PM

Share

Electric vehicles: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు గ్రీన్ కార్ లోన్(Green Car Loan) పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద, రుణ వడ్డీ రేటుపై 0.20% తగ్గింపు ఇస్తారు. ఇది కాకుండా, మీరు రుణం కోసం ప్రాసెస్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆఫర్ ప్రత్యేకత లివే 
  • ఈ పథకం కింద, ఇ-వాహనాన్ని కొనుగోలు చేయడానికి 0.20% తక్కువ వడ్డీతో రుణం లభిస్తుంది.
  • ఈ రుణాన్ని 8 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి.
  • SBI వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, SBI కార్ లోన్‌పై వడ్డీ రేటు 7.25% నుండి 7.60% వరకు ఉంటుంది.
  • దీని కింద, మీరు వాహనం యొక్క ఆన్-రోడ్ ధరలో 100% వరకు రుణం తీసుకోవచ్చు.
  • రుణం కోసం ఎటువంటి ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తున్నాయి 

              బ్యాంక్ పేరు                                                                                                                                                 వడ్డీ రేటు                                        
           ఇండస్సిండ్ బ్యాంక్                        7 .00%
           పంజాబ్ నేషనల్ బ్యాంక్                         7.05%
           సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా                         7.25%
           యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా                         7.30%
            IDBI బ్యాంక్                         7.35%

మీరు ఎలక్ట్రిక్ వాహనంపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా, వ్యాపారం చేసే పన్ను చెల్లింపుదారులు వాహనాన్ని తీసుకునే రుణంపై చెల్లించే తరుగుదల, వడ్డీపై ఆదాయపు పన్నులో మినహాయింపు పొందుతారు.  కానీ జీతం పొందే పన్ను చెల్లింపుదారులు ఈ సదుపాయాన్ని పొందరు. అయితే, ప్రభుత్వం చాలా ఎక్కువగా  ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది.

మీరు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి రుణం తీసుకున్నట్లయితే, ఆదాయపు పన్ను సెక్షన్ 80EEV కింద దానిపై చెల్లించే వడ్డీ గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు మినహాయించబడుతుంది. ఈ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి షరతు ఏమిటంటే, లోన్ బ్యాంక్ లేదా NBFC నుంచి  అయి ఉండాలి మరియు 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2023 మధ్య లోన్ మంజూరు చేయబడి ఉండాలి. ఈ మినహాయింపు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.