Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP: నెలకు రూ.10 వేల పెట్టుబడి పెడితే.. 7 సంవత్సరాల్లో రూ.11.37 లక్షల రాబడి..

దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు పెట్టుబడిదారుడికి సహాయపడే ఈక్విటీ పెట్టుబడి ఎంపికలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఉత్తమ ఎంపికగా ఉంది.

SIP: నెలకు రూ.10 వేల పెట్టుబడి పెడితే.. 7 సంవత్సరాల్లో రూ.11.37 లక్షల రాబడి..
Mf Investment
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 07, 2022 | 2:57 PM

దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు పెట్టుబడిదారుడికి సహాయపడే ఈక్విటీ పెట్టుబడి ఎంపికలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఉత్తమ ఎంపికగా ఉంది. ప్రతి నెలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ కాలం పాటు పెద్ద కార్పస్‌ను నిర్మించాలనుకునే వారికి ఇది మంచి పెట్టుబడి మార్గం. ఇన్వెస్కో ఇండియా డైనమిక్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ – గ్రోత్ దాని పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్ పథకం గత 7 సంవత్సరాలలో నెలవారీ రూ. 10,000 SIPని రూ. 11.37 లక్షలుగా మార్చింది.

ఇన్వెస్కో ఇన్వెస్కో ఇండియా డైనమిక్ ఈక్విటీ ఫండ్ – డైరెక్ట్ ప్లాన్ – గ్రోత్ జనవరి 2, 2013 నుంచి సుమారుగా 12 శాతం వార్షిక రాబడితో దాదాపు 191 శాతం సంపూర్ణ రాబడిని అందించింది. ఈ మ్యూచువల్ ఫండ్ పథకం దాని పెట్టుబడిదారులకు ఆల్ఫా రాబడిని అందించింది. లైవ్ మింట్ నివేదిక ప్రకారం గత ఒక సంవత్సరంలో ఈ మ్యూచువల్ ఫండ్ పథకం 2.50 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. గత 3 సంవత్సరాలలో ఈ ప్లాన్ వార్షిక రాబడి 7.65 శాతం, సంపూర్ణ రాబడి 24.80 శాతం ఇచ్చింది. అదేవిధంగా, గత 5 సంవత్సరాలలో ఈ పథకం వార్షిక రాబడి 7.75 శాతం కాగా, ఈ కాలంలో సంపూర్ణ రాబడి 45.35 శాతం.

వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం ఒక పెట్టుబడిదారుడు 3 సంవత్సరాల క్రితం ఈ మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌లో SIPని ప్రారంభించినట్లయితే, అప్పుడు అతని నెలవారీ SIP 10,000 అయితే ఈరోజు అతనికి రూ. 4.09 లక్షలుగా వచ్చేది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 10,000 సిప్ మోడ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే గత 5 సంవత్సరాలలో అతని నెలవారీ పెట్టుబడి రూ. 10,000 అయితే ఇప్పుడు దాని విలువ రూ. 7.26 లక్షలు అవుతుంది. అదే విధంగా, ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ. 10,000 SIPని ప్రారంభించినట్లయితే, అది 7 సంవత్సరాలలో రూ. 11.37 లక్షలకు పెరిగింది.