Electric Scooters: ఒకినావా నుంచి మరో రెండు స్కూటర్లు లాంచ్.. ఫీచర్లు, రేంజ్, ధర తెలుసుకోండి..
కేవలం మెట్రో సిటీలకే పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఒకినావా ఆటోటెక్ మరో రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. ఒకినావా ప్రైజ్ ప్రో, ఒకినావా ఐప్రైజ్ ప్లస్ పేరుతో వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది.

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తమ ముద్ర వేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ముఖ్యంగా చార్జింగ్ స్టేషన్లు, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో కూడిన బ్యాటరీలు లాంచ్ అవుతున్నాయి. కేవలం మెట్రో సిటీలకే పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఒకినావా ఆటోటెక్ మరో రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. ఒకినావా ప్రైజ్ ప్రో, ఒకినావా ఐప్రైజ్ ప్లస్ పేరుతో వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒకినావా ప్రైజ్ ప్రో..
2700వాట్ల సామర్థ్యంతో దీనిలోని మోటార్ పనిచేస్తుంది. గరిష్టంగా గంటకు 56 కిలోమీటర్ల వేగంగా ఈ స్కూటర్ ప్రయాణించగలుగుతుంది. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 81కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్ ఎఫ్‌ఆర్ డిస్క్, ఆర్‌ఆర్ డిస్క్ బ్రేకులు, రిజనరేటివ్ బ్రేకింగ్ తో కూడిన ఈ-ఏబీఎస్ వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల స్కూటర్ బ్రేకులు వినియోగించినప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్‌గా చార్జ్ అవుతుంది. దీనిలో 2.08కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనిలో ఎల్‌ఈడీ లైటింగ్స్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఉంటాయి. దీన ధర రూ. 99,645 ఎక్స్ షోరూం ఉంటుంది.
ఐప్రైజ్ ప్లస్..
ఈ స్కూటర్లో ఈ-ఏబీఎస్ రిజనరేటివ్ ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది. ముందువైపు హైడ్రాలిక్ టెలిస్కోపిక్, రియర్ డబల్ షాకర్, డ్యూయల్ ట్యూబ్ టెక్నాలజీతో ఈ స్కూటర్ వస్తుంది. దీనిలో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది చార్జ్ అవడానికి నాలుగు నుంచి ఐదు గంటలు సమయం పడుతుంది. సింగిల్ చార్జ్ పై 137 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 1,45,965 ఎక్స్ షోరూం ఉంటుంది.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




