Father’s Day: ఫాదర్స్ డే రోజు బీమా గిఫ్ట్.. మీరిచ్చే బహుమతితో జీవితాంతం అండ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే హడావుడి నడుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తండ్రికి ప్రత్యేక గిఫ్ట్ ఇస్తూ ఆనందంగా ఉంచాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం తండ్రికి బీమా గిఫ్ట్ ఇస్తే జీవితాంతం ఆయనకు అండగా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు చెప్పే సూచనలు తెలుసుకుందాం.

భారతదేశంలో జీవించే వయస్సు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి చాలా మంది పదవీ విరమణ తర్వాత దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు ఎటువంటి క్రియాశీల ఆదాయం లేకుండా గడుపుతారు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్ సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఆరోగ్య బీమా చాలా ఉపయోగంగా ఉంటుంది. భారతదేశంలో పెరుగుతున్న వైద్య ఖర్చులను నియంత్రించడంలో ఆరోగ్య బీమా కీలకంగా ఉంటుంది. ఇవి ప్రస్తుతం సంవత్సరానికి 14% పెరుగుతున్నాయి. అలాగే జీవిత బీమా కూడా వివేకవంతమైన ఆర్థిక ప్రణాళికలో ముఖ్యమైన భాగం. ముఖ్యంగా టర్మ్ అష్యూరెన్స్‌లు తక్కువ ప్రీమియంలతో పెద్ద మొత్తాలను కవర్ చేస్తాయి. ఏదైనా అనుకోని సందర్భాల్లో మరణం సంభవించినప్పుడు మనపై ఆధారపడిన వారికి ఎక్కువ మొత్తంలో సొమ్ము వచ్చేలా చేస్తయి. పదవీ విరమణ దగ్గరపడుతున్నప్పుడు ఎండోమెంట్, హోల్-లైఫ్ అష్యూరెన్స్‌లు కూడా కీలకంగా మారుతున్నాయి. ఈ పాలసీలు జీవిత కవర్‌కు హామీ ఇవ్వడమే కాకుండా క్రమశిక్షణ కలిగిన పొదుపు విధానాలను కూడా అలవాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫాదర్స్ డే రోజు మీ అవసరాలకు అనుగుణంగా మీ తండ్రికి ఆ బీమా చేయించి బహుమతిగా ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆరోగ్య బీమా, పదవీ విరమణ తర్వాత సంవత్సరాల్లో ముఖ్యమైనది. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు మరింత సాధారణంగా, సంక్లిష్టంగా మారుతాయి. అలాగే వృద్ధులు ఆసుపత్రిలో చేరడం, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి రుగ్మతలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఆరోగ్య బీమా పాలసీ ఒకరి కష్టపడి సంపాదించిన డబ్బును ఖాళీ చేయకుండా ఈ ప్రమాదాలను తగ్గిస్తుంది. వేయిటింగ్ పీరియడ్ తర్వాత ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేసే జీవితాంతం పునరుద్ధరించగల సామర్థ్యాన్ని అందించే, ఆసుపత్రిలో చేరడంతో పాటు ఔట్ పేషెంట్ సంరక్షణకు విస్తృతమైన రక్షణను అందించే పాలసీలు అవసరం. సాధారణంగా వృద్ధులకు వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు కుటుంబ ఫ్లోటర్ పాలసీల కంటే మెరుగ్గా ఉంటాయి.
గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం లేదా క్యాన్సర్ వంటి కొన్ని ప్రధాన వ్యాధుల చికిత్సలో ఆరోగ్య బీమా కీలక పాత్ర పోషిస్తుంది. పదవీ విరమణ కార్పస్‌ను తగ్గించకుండా పెరుగుతున్న వైద్య ఖర్చులతో అలాంటి చెల్లింపు ఖరీదైన చికిత్సలు, దీర్ఘకాలిక సంరక్షణను పొందేందుకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగత ప్రమాద బీమా పదవీ విరమణ తర్వాత కూడా వర్తిస్తుంది. అలాగే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ వంటి పథకాలు కూడా ఆపద కాలంలో ఆదుకుంటాయి. పదవీ విరమణ ఆధారిత యాన్యుటీ ప్లాన్‌లు పదవీ విరమణ తర్వాత హామీ ఇవ్వబడిన నెలవారీ ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి ఇవి రోజువారీ ఖర్చులకు అనువుగా ఉంటాయి. కాబట్టి ఫాదర్స్ డే రోజు తండ్రికి బీమా బహుమతే సరైనదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








