పీఎఫ్ ఖాతాదారులకు (PF) అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలపై ట్యాక్స్ పడే అవకాశం ఉంది. అంటే పీఎఫ్ ఖాతాలలో రూ.2.5 లక్షలకు పైగా జమ అయ్యే ఖాతాలపై ట్యాక్స్ పడే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ.. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి తెలిసిందే. ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత వారికి పీఎఫ్ నగదు ఉపయోగపడుతుంది. సంవత్సర ఆదాయం రూ. 20.83 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే పీఎఫ్ పన్ను వర్తిస్తుంది. అంటే.. ఎక్కువగా పీఎఫ్ అకౌంట్ లో నగదు జమ అయ్యే వారి ఖాతాలపై మాత్రమే ఈ ట్యాక్స్ పడనుంది.
ఓ వ్యక్తి తన పీఎఫ్ ఖాతాలో సంవత్సరంలో రూ. 5 లక్షలను జమ చేస్తే.. దానిపై రూ. 2.50 లక్షలకు పన్ను విధిస్తారు. అలాగే మిగిలిన మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా ఉంటుంది. అయితే ఈ కొత్త రూల్ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్‌కు రూ. 6 లక్షలు జమ చేస్తే కేవలం రూ. లక్ష మాత్రమే ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయంగా లెక్కిస్తారు. మిగిలిన మొత్తం పన్ను రహితంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ లేదా ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఉంటుంది. రూ. 2.5 లక్షలకు పైగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నవారు పీఎఫ్ ఖాతాను రెండు భాగాలుగా మార్చుకోవాల్సి వస్తుంది.అంటే.. రూ.2.5 లక్షల నగదు ఒక అకౌంట్ లోకి.. మిగతా డబ్బు మరో అకౌంట్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువగా ఉన్న నగదుపై ట్యాక్స్ పడుతుంది.
కొత్త నిబంధనలు..
1. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ ఖాతాలు.. ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ అనే కేటగిరిలుగా విడిపోతున్నాయి.
2. అలాగే..2021 మార్చి 31 నాటికి క్లోజ్ అయిన అకౌంట్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వంతెలిపింది.
3. కొత్త నిబంధనల ప్రకారం..వార్షిక ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల కన్నా ఎక్కువగా వచ్చే వారు ఆ మొత్తం పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
4.రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ నగదు వచ్చేవారు రెండు ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసుకోవాలి.
5. పన్నుపరిధిలోకి వచ్చే ఖాతాదారులకు ప్రభుత్వం నుంచి లభించే ప్రయోజనాలు కూడా నిలిచిపోనున్నాయి.
6. ఎక్కువ నగదు వచ్చే వారి ఖాతాలపై కొత్త పన్ను విధించేందుకు ఐటీ నిబంధనలకు కొత్త సెక్షన్ 9డీని తీసుకొచ్చింది.
Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం
NTR: యంగ్ టైగర్ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..
Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్
Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్