AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PFపై వడ్డీపై కీలక అప్డేట్‌..! వడ్డీ డబ్బులు అకౌంట్‌లో ఎప్పుడు పడతాయంటే..?

EPFO ఖాతాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును CBT ప్రకటించింది. అయితే ఈ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ అవుతుందనేది స్పష్టం కాలేదు. ప్రభుత్వ ఆమోదం పొందేందుకు సుమారు మూడు నెలలు పట్టవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం చివరి బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు.

PFపై వడ్డీపై కీలక అప్డేట్‌..! వడ్డీ డబ్బులు అకౌంట్‌లో ఎప్పుడు పడతాయంటే..?
Epfo 4
SN Pasha
|

Updated on: Mar 14, 2026 | 6:15 AM

Share

PF ఖాతాదారులకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని EPFOకు చెందిన CBT తీసుకుంది. అయితే ఈ వడ్డీ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ అవుతుందనే విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. నిపుణుల సమాచారం ప్రకారం.. వడ్డీ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసే ప్రక్రియకు సాధారణంగా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. మొదట EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతి ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.

ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని పరిశీలించి తుది ఆమోదం ఇచ్చిన తర్వాతే వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతం మొదటి దశ పూర్తయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావడానికి సుమారు మూడు నెలల వరకు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. EPF వడ్డీ లెక్కింపు కూడా నిర్దిష్ట నియమాల ప్రకారం జరుగుతుంది. EPF స్కీమ్ 1952లోని నిబంధనల ప్రకారం వడ్డీ లెక్కింపు పద్ధతి నిర్ణయించబడింది. ఆర్థిక సంవత్సరం చివరలో ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. అంటే గత సంవత్సరం చివరి బ్యాలెన్స్‌పై పూర్తి 12 నెలలకు వడ్డీ వర్తిస్తుంది.

ఒకవేళ సభ్యుడు ఆర్థిక సంవత్సరంలో PF ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకుంటే, ఆ మొత్తం ఉపసంహరించిన తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కిస్తారు. ఆ తేదీ తర్వాత ఆ మొత్తంపై వడ్డీ వర్తించదు. అయితే ఉపసంహరణకు ముందు కాలానికి వడ్డీ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి PF ఖాతాలో కొత్తగా జమ చేసిన మొత్తంపై కూడా వడ్డీ లభిస్తుంది. అయితే ఆ మొత్తం జమ చేసిన నెల తర్వాతి నెల మొదటి రోజు నుంచి మార్చి 31 వరకు వడ్డీ లెక్కిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం ఇచ్చిన తర్వాతే 8.25 శాతం వడ్డీ మొత్తాన్ని ఉద్యోగుల PF ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా జూన్ లేదా జూలై నెలల్లో ఈ వడ్డీ జమ అయ్యే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..