Petrol Diesel Price: వాహనదారులకు కాస్త ఉపశమనం.. ఈరోజు కూడా స్థిరంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

|

May 02, 2022 | 9:35 AM

Petrol Diesel Price: గత కొన్ని రోజుల కిత్రం ప్రతీరోజూ పెరుగుతూ పోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ మధ్య కాస్త శాంతించాయి. ఇటీవల ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గడిచిన రెండు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో...

Petrol Diesel Price: వాహనదారులకు కాస్త ఉపశమనం.. ఈరోజు కూడా స్థిరంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..
Follow us on

Petrol Diesel Price: గత కొన్ని రోజుల కిత్రం ప్రతీరోజూ పెరుగుతూ పోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ మధ్య కాస్త శాంతించాయి. ఇటీవల ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గడిచిన రెండు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా భారీగా పెరిగిన ముడి చమురు ధరల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని వచ్చిన వార్తలు వినియోగదారులను ఆందోళన గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ధరల పెరుగుదలకు బ్రేక్‌ పడడంతో సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించింది. మరీ సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120.51, డీజిల్‌ రూ. 104.77 గా ఉన్నాయి.

* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. గా ఉండగా, డీజిల్‌ రూ. వద్ద కొనసాగుతున్నాయి.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.09 కాగా, డీజిల్‌ రూ. 94.79 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేవు. ఇక్కడ సోమవారం లీటర్ పెట్రోల్‌ ధర రూ. 119.49 గా ఉండగా, డీజిల్ రూ. 105.49 వద్ద కొనసాగుతోంది.

* వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 119.18 గా నమోదుకాగా, డీజిల్‌ రూ. 105.19 గా ఉంది.

* గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 121.60 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 107.18 గా ఉంది.

* విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 120.26 కాగా, డీజిల్‌ రూ. 105.89 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: TS Group 1 Notification: గ్రూప్‌ 1 అభ్యర్థులకు అలర్ట్‌.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఎప్పుడంటే..

PM Kisan: రైతులకి శుభవార్త.. ఈ వారమే ఖాతాలలోకి 2000 రూపాయలు..!

Yes Bank: నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన యెస్‌ బ్యాంక్‌.. 2019 తర్వాత మొదటిసారి లాభాల్లోకి..