Petrol Diesel Prices: వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌ ధర ఎంతంటే..?

Petrol Diesel Prices: మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రలో, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెరిగాయి. ఈ పెరుగుదల 137 రోజుల తర్వాత జరిగింది.

Petrol Diesel Prices: వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌ ధర ఎంతంటే..?
Petrol Diesel Prices

Updated on: Mar 22, 2022 | 5:41 AM

Petrol Diesel Prices: మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రలో, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెరిగాయి. ఈ పెరుగుదల 137 రోజుల తర్వాత జరిగింది. సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ఇంధన రిటైలర్లు మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 80 పైసలు పెంచుతున్నట్లు ఆలస్యంగా తెలిపారు. గతేడాది నవంబర్‌ తర్వాత పెరగడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో నేడు ఉదయం ఆరుగంటల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది.

మూడు ప్రభుత్వరంగ ఇంధన రిటైలర్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ భారతదేశంలో ఇంధన రిటైలింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వాటి ధరలను కలిసి పెంచుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21గా ఉండగా, డీజిల్ ధర రూ.87.47గా ఉంది. వాస్తవానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నవంబర్ 4 నుంచి ధరలు పెంచలేదు.

కొన్ని నెలలకు ముందు భారత్‌లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించడంతో వినియోగదారులకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.108.20 ఉండగా, డీజిల్‌ ధర రూ. 94. 62గా ఉంది. పెంచిన ధరలతో పెట్రోలు ధర రూ.109.10, డీజిల్‌ 95.49కు చేరనుంది.

Almond Oil: బాదం నూనెతో కళ్లకింద నల్లటి వలయాలకి చెక్.. ఈ 5 పద్దతుల్లో ప్రయత్నిస్తే కచ్చితమైన ఫలితాలు.

Relationship: ఆ సమయంలో మహిళలకి, పురుషలకి ఉన్న తేడా అదే..!